ఇది మామూలు వాపేనా?


Sat,February 16, 2019 01:31 AM

మా అబ్బాయి వయసు 5 సంవత్సరాలు. వారం రోజులుగా చెవి నుంచి దవడ భాగం వరకు వాపు వచ్చింది. డాక్టరును సంప్రదిస్తే వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు. మా ఇంట్లో మిగతా పిల్లలకు కూడా రెండు వారాల క్రితం ఇలాగే అయ్యి తర్వాత తగ్గిపోయింది. ఇలా వాపు రావడానికి కారణం ఏంటి? ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? ఇది సాధారణ సమస్యా? లేక తీవ్రమైందా? దీనికి ఎలాంటి చికిత్స చేస్తారు? దయచేసి తెలుపగలరు?
- ఎన్. జగన్‌మోహన్, భద్రాద్రి కొత్తగూడెం

Councelling
జగన్‌మోహన్ గారూ.. మీ అబ్బాయికి వచ్చిన వ్యాధి లాలాజల గ్రంథులకు సోకే వైరల్ ఇన్ఫెక్షన్. దీనినే గవదబిళ్లలు లేదా మంప్స్ అని కూడా అంటారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. తుమ్ములు.. దగ్గుల వల్ల గాలిలో చేరి ఇతరులకు వ్యాపిస్తుంది. పెద్దవాళ్లకు కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ చిన్నపిల్లల్లోనే తీవ్రంగా ఉంటుంది. లాలాజల గ్రంథిలో నొప్పి వచ్చి జ్వరం.. తలనొప్పి.. ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. దీని ప్రభావం 1-2 వారాల వరకు ఉంటుంది. ఇది సీరియస్ కండీషన్ ఏం కాదు. కాకపోతే ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదిస్తే 6-10 రోజుల్లో తగ్గిపోతుంది. గతంలో దీని తీవ్రత ఇండియాలో ప్రతి లక్ష మందికి 100-1000 మందికి వచ్చేది. ఇప్పుడు ఇంత తీవ్రంగా లేదు. 9-15 నెలలలోపు ఒకసారి.. 6 సంవత్సరాలలోపు రెండోసారి ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు. వీటిని తీసుకోవడం వల్ల గవదబిళ్లల్లాంటి సమస్యలు రావు. పెద్దవాళ్లలో వస్తే వినికిడి లోపం సమస్య ఏర్పడుతుంది. మగవాళ్లలో వృషణాలకు.. స్త్రీలలో అండాశయానికి సోకి సంతానలేమి సమస్యలు ఏర్పడుతాయి.

డాక్టర్ రవిశంకర్
చెవి, ముక్కు, గొంతు నిపుణులు
ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్, హైదరాబాద్

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles