పద్యం నేర్చుకొందాం


Fri,February 15, 2019 01:33 AM

Padyam-Nerchukundam
అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానురూప పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
గటకచరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలమున్.
- అల్లసాని పెద్దన (మనుచరిత్ర, ద్వితీయాశ్వాసం, ప్రవరాఖ్యుని పద్యం)

అతికఠిన పద్యాలలో ఒకటి!

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈమధ్య జరిగిన ఒక ఛాయాచిత్ర ప్రదర్శన సందర్భంగా మాజీ డీజీపీ పేర్వారం రాములు తన ప్రసంగంలో భాగంగా పలు పద్యాలు వినిపించారు. ఆయనకు కంఠస్థమైన అతికఠిన పద్యాలలో ఇదొకటిగా వారు పేర్కొన్నారు. అల్లసాని పెద్దన విరచితమైన మనుచరిత్రలో ప్రవరాఖ్యుని పద్యంగా ఇది ఎంతో ప్రసిద్ధినొందింది. ఎందరికో ఇది కంఠస్థం కూడా. మరి, పాఠకులారా! మీకూ..ఇలాంటి పద్యాలు కంఠస్థంగా వస్తే, ఇటీవలి కాలంలో ఎక్కడైనా వేదికపైన చదివినా వెంటనే మాకు రాసి పంపండి. మీ పేరుతో ఇక్కడ ప్రచురిస్తాం. ఈ తరహా పద్యాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని, పలుమార్లు చదవడం ద్వారా కంఠస్థం చేసుకోగలిగితే మన సంస్కృతిని పరిరక్షించుకున్న వాళ్లమవుతాం.

591
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles