గుండె వేగాన్ని పెంచే పేస్‌మేకర్


Tue,February 12, 2019 01:38 AM

Pace-Maker
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండె నిమిషానికి డబ్బయి సార్లు కొట్టుకుంటుంది. వయసు పెరిగేకొద్దీ హృదయ స్పందనలు తగ్గుతుంటాయి. ఇది ఒక సమస్యగా మారి గుండె వేగంగా కొట్టుకోకపోతే ఎలా?గుండె వేగంగా కొట్టుకోకపోతే డాకర్లు ప్రత్యామ్నాయంగా ఓ పరికరం అమరుస్తారు. దానినే పేస్‌మేకర్ అంటారు. హృదయ స్పందనలను సరిగ్గా కంట్రోల్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. మనిషిని కొంతకాలం ఎక్కువగా బతికించుకునే అవకాశం ఉన్న పద్ధతి ఇది. పేస్‌మేకర్ ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. అరిథ్మియా బారిన పడినవారికి దీనిని అమరుస్తారు. బ్యాటరీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. గుండె కొట్టుకోవడానికి కావాల్సిన విద్యుత్ ప్రేరణల్ని కూడా పేస్ మేకర్ ఇస్తుంది. దీంట్లో ఒక పల్స్ జనరేటర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఈ పరికరంలో ఉండే లెడ్స్ గుండెలోని కండరాలు బాగా పనిచేసేట్లు చేస్తాయి. ఐతే గుండె వేగం తగ్గిన ప్రతి ఒక్కరికీ పేస్ మేకర్ అమర్చలేరు. గుండె కండరాలు మందంగా ఉంటేనే దీనిని అమరుస్తారు. ఏడేళ్ల వరకు బ్యాటరీ పనిచేస్తుంది.

475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles