ఐరన్ ఆదుకుంటుంది!


Tue,February 12, 2019 01:36 AM

Iron-Supplement
ఐరన్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు నిపుణులు. మరణాల శాతాన్ని కూడా తగ్గించే సామర్థ్యం వీటికి ఉందని చెప్తున్నారు.


ఐరన్ సప్లిమెంటేషన్ వల్ల చిన్నపిల్లల మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చనీ.. వయోజనులకు హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడవచ్చని అంటున్నారు నిపుణులు. కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తాజాగా ఐరన్ సప్లిమెంటేషన్‌పై అధ్యయనం చేసింది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. అడుగుతీసి అడుగేయాలంటేనే ఆయాసపడేవాళ్లకు ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తే కేవలం రెండు నిమిషాల్లోనే ఉత్తేజితులై నడుస్తారని వారు చెప్తున్నారు. తమ పరిశీలనలో 53.5% పురుషులు.. 46.4% స్త్రీలు ఐరన్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. వీరందరికీ IV ఐరన్ ఇవ్వడం వల్ల వెంటనే మార్పులు కనిపించాయట. హృద్రోగాలు ఉన్నవారికీ.. మానసిక సామర్థ్యం సరిగ్గా లేనివారికి.. ఇది చక్కని పరిష్కారంగా పనిచేస్తుందని సూచించారు.

56
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles