
మెనోపాజ్ దశలో ఆడవాళ్లకు ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఇది. వయసు పెరిగినా కొద్దీ ఈ సమస్య ఎక్కువవుతుంటుంది. దీనిని ఎలా గుర్తించాలి?
రుతుక్రమం వల్ల కాల్షియం చాలా తగ్గిపోతుంది. క్రమంగా ఇది ఆస్టియో పోరోసిస్కు దారితీస్తుంది. ఈస్ట్రోజన్ తగ్గినా కూడా ఈ సమస్య వస్తుంది. చిన్న వయసులో తల్లికావడం.. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆస్టియో పోరోసిస్ సమస్య వస్తుంది. దీనివల్ల ఎముకల కణాల్లో సాంద్రత తగ్గుతుంది. పటుత్వం కూడా తగ్గిపోతుంది. ముట్టుకున్నా కూడా నొప్పి వచ్చేంత సెన్సిటివిటీగా మారిపోతాయి. చాలామందికి ఈ సమస్య గురించి తెలియదు. నడుము కాస్త వంగిపోవడం.. ఎముకలు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే సాధారణంగా వచ్చే నొప్పిగానే భావిస్తుంటారు. కానీ ఇది ఓ వ్యాధి అని గుర్తించరు. దీని నుంచి బయటపడాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. పాలు.. పాల పదార్థాలు డైలీ మెనూలో ఉండాలి.