అక్క పెండ్లి కోసం మారథాన్‌లో..


Tue,February 12, 2019 01:14 AM

స్ఫూర్తివంతమైన క్రీడాకారుల జీవిత కథలకు భారతదేశంలో కొరత లేదు. కటిక పేదరికం నుంచి దేశం గర్వించే స్థాయికి వెళ్తున్న క్రీడాకారులను మన దేశంలో చూడవచ్చు. తగినంత సాయం, ఆర్థిక సామర్థ్యం లేనప్పుడు ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించటం కష్టంగానే మారుతుంది. కానీ పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు అని నిరూపిస్తున్నారు మన దేశ క్రీడాకారులు.
poonam-marathon
ఒకవైపు పేదరికం మరోవైపు ప్రతిభ... ఇందులో ఏది గెలుస్తుందంటే కచ్చితంగా ప్రతిభకు మార్కులు ఇవ్వాల్సిందే.. ఆ ప్రతిభకు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని, కృషిని జోడిస్తే విజయం వరిస్తుంది. దీని ముందు పేదరికం పరార్ అవుతుంది. పుణెకు చెందిన పూనమ్ సోనన్ అనే 19 ఏండ్ల క్రీడాకారిణిది అలాంటి కథే.. తండ్రి వ్యవసాయ కూలి. పూనమ్‌కు క్రీడలమీద పట్టుంది. పరుగుపందెంలో సత్తా చాటుతుంది. కానీ ఒకవైపు పేదరికం వెంటాడుతున్నది. ఈ క్రమంలో తన సోదరి పెండ్లి దగ్గరకు వచ్చింది. ఈ పెండ్లి చేయడానికి కూడా ఆ కుటుంబం వద్ద డబ్బులు లేవు. అప్పుడు పూనమ్ ఆ పెండ్లి బాధ్యత భుజానికెత్తుకుంది. ఎలాగైనా పెండ్లికి డబ్బులు సరిపుచ్చాలని అనుకుంది. కోచ్ విజేంద్రసింగ్ సాయంతో అప్పుడే పుణెలో జరిగిన మారథాన్‌లో పాల్గొన్నది. పరుగులు తీసి విజయం సాధించింది. ప్రైజ్‌మనీ 1.4లక్షలను సొంతం చేసుకుని ఇంటికి వచ్చింది. కానీ అక్కడ పెండ్లికి మాత్రం హాజరు కాలేకపోయింది. ఎందుకంటే ఆ సమయంలోనే సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనడానికి ఎంపికైంది. ఇలాంటి మారథాన్‌లలో పాల్గొని విజయం సాధించాలని, కుటుంబ పరిస్థితులను మార్చాలని పూనమ్ కోరుకుంటున్నది.
poonam-marathon2

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles