నిమ్మ.. మేలు చేయునమ్మా!


Mon,February 11, 2019 11:13 PM

సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండు నిమ్మపండు. శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో ఇందులో దొరుకుతాయి. పుల్లగా రుచిగా నోరూరించే నిమ్మతో కలిగి లాభాలేంటో తెలుసుకోండి.
lemonn
-గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టువ్యాధి మొదలైన చర్మ వ్యాధులతో బాధపడేవారు. నిమ్మరసాల్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి బయట పడొచ్చు.
-నిమ్మరసం ఆరోగ్యానికే కాకుండా అందానికీ ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి నిమ్మనూనె చర్మానికి రుద్దుకుంటే ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చల నివారణకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
-నిమ్మరసం, ఉప్పు, కొంచెం పసుపు కలిపిన మిశ్రమంతో దంతాలు తోమాలి. వారానికి రెండుసార్లయినా ఇలా చేస్తే దంతాలు మెరవడంతో పాటు చిగుళ్ల వ్యాధి ఉన్నవారికి ఔషధంగానూ పనిచేస్తుంది.
-శరీరం నీరసించినప్పుడు స్లైన్‌కు బదులు కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం తొలగడంతో పాటు చాలా ఉత్సాహంగా ఉంటారు.
-పరిగడుపున నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతోపాటు ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

487
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles