విశ్వ దర్శనం గ్రహం కనుమరుగు!


Mon,February 11, 2019 11:12 PM

Vishwa-Darshanam
విశ్వంలో మరొక అనూహ్య దృశ్యాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అసాధారణ వేగంతో తనదైన మాతృ నక్షత్రంలోకి విలీనమైపోతున్న గ్రహాన్నొక దానిని వారు తాజాగా చిత్రీకరించారు.


మరణం భూమ్మీది జీవులకే కాదు, విశ్వంలోని ప్రతీ ఖగోళ భౌతిక వస్తువుకూ ఉంటుందన్నది ఎంత వాస్తవమో ఈ అంతరిక్ష ఘటన మరోసారి నిరూపిస్తున్నది. మహాద్రవ్యరాశితో కూడిన భారీ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు సైతం ఏదో ఒకనాటికి కుప్పకూలిపోవాల్సిందే. మన భూమి నుండి సుమారు 97 కాంతి సంవత్సరాల దూరంలోని ఒక మధ్యతరహా బాహ్యగ్రహం అనూహ్యరీతిలో తన మాతృనక్షత్రం వికిరణ శక్తి ధాటికి వినాశనమవుతున్న వైనాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల కనిపెట్టింది. జిజె 3470బిగా పిలుస్తున్న ఈ గ్రహం నెప్ట్యూన్ అంత పరిమాణంలో ఉన్నది. గత రికార్డుకన్నా సుమారు 100 రెట్ల అధిక వేగంతో ఇది ఆవిరైపోతున్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ గ్రహాన్ని మింగేస్తున్న దాని మాతృతార పేరు జిజె 3470. ఇదొక ఎర్రకుబ్జతార. ఏ నక్షత్రమైనా సరే దాని ఆయుర్దాయం ముగిశాక ఇలా ఎర్రకుబ్జతార స్థితికి చేరుకొని, తన చుట్టూ తిరిగే గ్రహవ్యవస్థనంతా పీల్చేసుకుంటుందని వారు ఇదివరకే తేల్చారు. మరి, మన భూమి, సౌరవ్యవస్థల పరిస్థితీ ఇంతేనేమో. కాకపోతే, దానికి ఇంకా అనేక కోట్ల సంవత్సరాల సమయం ఉందన్నది స్పష్టం.

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles