పనితనం


Tue,February 12, 2019 01:09 AM

Panitanam
విద్యుత్తు ప్రకృతిలో ఉన్నదే అయినా బొగ్గు, చమురు, నీరు, సౌర, పవనశక్తులు వంటివాటిలోంచి దానిని ఉత్పత్తి చేసుకోవడం, కనిపించే తీగల్లోంచి కనిపించని విద్యుత్తును ప్రవహింపజేయడం మనిషి సాధించిన అద్భుతాలలో ఒకటి. లోహపు తీగలకు ప్లాస్టిక్ పొరలు లేకపోతే ఒక రకంగా కరెంటు ప్రసరణ ప్రమాదమే. పవర్‌గ్రిడ్‌కు పెద్ద మొత్తంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తయి వస్తే, అక్కడ్నించి సబ్‌స్టేషన్లకు వెళుతుంది. ఇక్కడ కొంత వోల్టేజీ నియంత్రణ జరుగుతుంది. స్తంభాల మీది తీగలు లేదా భూగర్భంలోని లైన్ల ద్వారా నివాస ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది. నివాస ప్రాంతాలకు సుమారు 4,200 నుంచి 34,500 వోల్ట్‌ల కరెంటు సరఫరా అయితే, స్తంభాల నుంచి గృహ వినియోగానికి 120 నుంచి 240 వోల్ట్‌ల వరకు సరఫరా అవుతుంది. లోహాలు, నీరు, తడి వస్తువులు, చెట్లు, మనుషులతోసహా జీవజాతులు (శరీరంలోనూ నీరుంటుంది కాబట్టి) అన్నీ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తే, రబ్బరు, గాజు, పింగాణీ, ప్లాస్టిక్‌లు నిరోధకాలుగా పనిచేస్తాయి.

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles