సుచరిత


Tue,February 12, 2019 01:07 AM

Sucharitha
ఇంటిని లేదా పెట్టె, సూట్‌కేసులు, వాహనాలు వంటి వాటిని భద్రపరచుకోవడానికి ఉద్దేశించిన తాళానికి సుమారు 4,000 ఏండ్ల చరిత్ర ఉంది. మెసొపొటేమియన్ల కాలంలోనే తాళం-చెవిల వాడకం ఉన్నట్టు పురాతత్వ శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి. ప్రాచీన అస్సీరియా (Assyria) రాజ్య రాజధాని నైనెవే (Nineveh) నగర శిథిలాలలో అతి పురాతన తాళపు పరికరాలు లభించాయి. తర్వాత ఈజిప్ట్ తదితర ప్రాంతాలలో తాళం వాడకం మనుగడలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాలలో కచ్చితమైన తాళం చెవితో మాత్రమే తెరచుకోగలిగే వార్డెడ్ లాక్స్ (warded locks) అభివృద్ధి చెందాయి. తొలి లోహపు తాళం చెవులను క్రీ.శ. 870-900 మధ్య కాలంలో ఆంగ్లేయ వృత్తి పనివారు తయారుచేశారు. సంపన్న రోమన్లు తమ ఉన్నత స్థాయిని చాటుకోవడానికే అన్నట్టుగా తాళపు చెవుల్ని ఉంగరాల మాదిరిగా చేతివేళ్లకు తొడుక్కొనే వారు. 18వ శతాబ్దంలో ఆధునిక తాళాలు వేగంగా వాడకంలోకి వచ్చాయి. తాళాలలో లివర్ల వ్యవస్థను క్రీ.శ.1778లో రాబర్ట్ బార్రన్ కచ్చితమైన పద్ధతిలో ప్రవేశపెట్టారు. క్రీ.శ.1818లో లివర్ టంబ్లర్ లాక్స్ వచ్చాయి. అనూహ్య మార్పులు, అభివృద్ధితో ఇప్పటికి యాంత్రికమైన వాటిని తలదన్నేలా అనేక రకాల ఎలక్ట్రానిక్ తాళాలు కూడా వచ్చేశాయి.

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles