ఎలాగంటే?


Tue,February 12, 2019 01:02 AM

Elagante
తామర ఆకుమీద నీటిబొట్లు నిలవ్వు. అసలు నీటిలో ఆ ఆకులు తడవ్వు. పైగా, నీటి చుక్కలు వాటిపై చూడడానికి ముత్యాల్లా మెరుస్తాయి కూడా. ఇది ఎందుకు, ఎలా? కలువ (తామర) పువ్వు ఎంతో అందమైంది. తామర, కలువ రెండూ ఒకటి కాదు. వీటి మధ్య కొద్ది తేడా ఉంటుంది. నింఫియా కుటుంబానికి చెందిన కలువ చెట్టు ఆకుల నడుమ కటింగ్ ఉండడంతో ఇవి నీటిలో తేలిగ్గా తడుస్తాయి. ఇవి అనేక రంగుల్లోనూ ఉంటై. కానీ, తామర అలా కాదు. ఈ మొక్కల ఆకులు గుండ్రంగా వుంటై. ఈ పూలు తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటై. తామరాకులపైన జిడ్డు వంటి పదార్థం ఉండటమే కాక వీటికి జల వికర్షణ గుణం ఉంటుంది. దీనివల్లే నీటి చుక్కలు తామర ఆకులపైన నిలువకుండా జారుతుంటాయి. ఈ జల వికర్షణ శక్తే గాలిని పట్టేసి ఒక కుషన్‌లా ఆకుపై ఆవరింపజేయడంతో నీటి తడి దానికి తగలదు.

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles