ఎయిర్‌హోస్టెస్ సాహసం


Mon,February 11, 2019 01:14 AM

ఎయిర్ హోస్టెస్ అంటే పెదాలపై నవ్వుల లిప్‌స్టిక్ రాసుకుని విమానంలోకి వచ్చే ప్రయాణిలకును ఆహ్వానించటమే అనుకుంటాం. కానీ ఈ వృత్తిలో చేరడానికి ముందు వాళ్లకు శిక్షణ ఏ తరహాలో ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా.. రాధిక అహైర్ చేసిన ఓ సాహసం చూస్తే అదేంటో మీకు అర్థమవుతుంది.
radhika
విమానంలో సిబ్బంది అంటే పైలెట్, ఎయిర్ హోస్టెస్. మరి ఉన్నట్టుండి విమానంలో ప్రమాదం ఏర్పడితే పైలెట్లు చూసుకుంటారా? వాళ్లతో సమానంగా ఎయిర్ హోస్టులు కూడా ఆ ప్రమాదం నుంచి ప్రయాణికులను రక్షించడానికి కృషి చేస్తారు. మరి వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే.. ఉద్యోగంలో చేరకముందే ఆ విధంగా శిక్షణనిస్తాయి విమానయాన సంస్థలు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవసరమైనప్పుడు, ప్రయాణికులకు గుండెనొప్పి వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ముందే శిక్షణ తీసుకుంటారు. ఇవి చాలా వరకు కఠినంగా ఉంటాయి. అయితే రాధిక అహైర్ అనే ముంబైకి చెందిన ఎయిర్ హోస్టెస్ తన వృత్తిలో భాగంగా తీసుకున్న శిక్షణ నైపుణ్యంతో భారీ అగ్నిప్రమాద సమయంలో సాహసం చేసింది. అమె నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌లో ఉదయంపూట అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలు వ్యాపించాయి. దీంతో రాధిక, ఆమె సోదరుడు కలిసి మంటలు వ్యాపించిన తొమ్మిదో ఫ్లోర్‌కు వెళ్లింది. అదృష్టం కొద్ది మంటలు వ్యాపించిన ప్రాంతంలో ఎవరూ మంటల్లో చిక్కుకోలేదు. మంటలు వ్యాపించిన కొద్ది క్షణాల్లోనే ఆమె తొమ్మిది ఫ్లోర్లను ఎక్కి, ఆ ప్రదేశానికి వెళ్లగలిగింది. ఆమె ఎయిర్ హోస్టెస్‌గా తీసుకున్న శిక్షణనే దీనికి కారణం అంటూ తెలిపింది.
radhika1

963
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles