కంటికురుపు ఇలా మాయం!


Mon,February 11, 2019 01:06 AM

కళ్లు చాలా సున్నితమైనవి. కంట్లో నలక పడితేనే అల్లాడిపోతాం.. అలాంటిది కనురెప్పలపై కురుపులు వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ కురుపు కరిగిపోయి ఉపశమనం లభిస్తుంది.
kanti-kurupu
-జామ ఆకును వేడి చేయాలి. వేడి చేసిన ఆకుని బట్టలో కట్టాలి. దీన్ని కంటి కురుపుపై కొంతసేపు కాపాలి. ఇలా రెండు రోజులు చేస్తే కంటికురుపు కరిగిపోతుంది.
-ఉప్పును వేడినీటిలో బాగా మరిగించాలి. నీరు చల్లారాక వడకట్టాలి. వచ్చిన నీటిని రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
-కొన్ని లవంగాలను తీసుకొని బాగా నూరి ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని కంటికురుపు మీద పెట్టుకోవాలి. ఇలా చేస్తే రెండురోజులో కురుపు మాయమవుతుంది.
-టీ బ్యాగ్‌ను వేడి నీటిలో ముంచి దాన్ని కంటి కురుపు మీద పది నిమిషాల పాటు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది.
-ఆలుగడ్డలను మెత్తగా గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బట్టలో పెట్టి కట్టాలి. ఆలూ రసాన్ని కురుపు మీద తుడవాలి.
-ఆముదాన్ని వేళ్ళతో తీసుకొని కురుపు మీద పలుమార్లు రుద్దాలి. వీలైనన్ని సార్లు చేస్తూ ఉంటే కురుపు తగ్గుతుంది.

962
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles