ఆకట్టుకుంటున్న ఎక్కడికి ఈ పరుగు


Thu,January 24, 2019 02:25 AM

సినిమా హీరోగా తెరపై కనిపించిణ చాలాకాలం తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌తో మన ముందుకొచ్చాడు ఆర్యన్ రాజేష్. జీ5 యూట్యూబ్ చానల్‌లో టెలికాస్ట్ అవుతున్న ఎక్కడికి ఈ పరుగు వెబ్ సిరీస్‌లో తనదైన శైలిలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. నెటిజనుల మన్ననలు పొందుతున్న ఎక్కడికి ఈ పరుగు వెబ్ సిరీస్ విశేషాలివి..
rajesh
ఆర్యన్ రాజేష్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఎక్కడికి ఈ పరుగు నెటిజనులను ఆకట్టుకుంటున్నది. అభయ్, అభిలాష్, నరేష్, అశ్వత్, అనిల్, రాగ్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. మిగతా వారి కంటే భిన్నంగా, వినూత్నంగా హీరో నానీ ట్విట్టర్ అకౌంట్ మీద అక్కినేని నాగార్జునతో దీని ట్రైలర్ విడుదల చేశారు. అనంత విశ్వం రాక్షస వంశం. జగమెరుగని నిజం.. మనిషే ఒక మృగం.. తోడైన నీ స్నేహం.. చూపించేనా నరకం.. ఎక్కడికి ఈ పరుగు అంటూ మొదలైన ట్రైలర్ వెబ్ సిరీస్ మీద అంచనాలు పెంచింది. చాలాకాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చిన ఆర్యన్ రాజేష్ ఈ వెబ్‌సిరీస్‌లో పోలీస్ అధికారి పాత్రను రక్తి కట్టించాడు. జనవరి 8న విడుదలైన ఈ వెబ్ సిరీస్ వెబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. లక్షల సంఖ్యలో ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. ఎఫ్ టీవీ, జీ5 చానళ్లలో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన వస్తున్నది. జీ5 ఇండియాలో ఉదయం 8 గంటలకు, ఎఫ్ టీవీలో రాత్రి 8 గంటలకు ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవుతున్నది. మైండ్ గేమ్‌ను తలపించే సినిమా రేంజ్‌లో ఈ వెబ్ సిరీను తెరకెక్కించారు. నటీనటు నటన అద్భుతంగా ఉంది.


అంతకు ముందే శశాంక్‌తో కలిసి యదార్థం అనే షార్ట్‌ఫిలిం తీసిన డైరెక్టర్ ఎక్కడికి ఈ పరుగు వెబ్ సిరీస్‌లో చేయమని ఆర్యన్ రాజేష్‌ని కలిశాడు. వెబ్ సిరీస్ అంటే చిన్న చిన్న వాళ్లు కూడా చేస్తారు. కానీ.. ఇప్పటికే పెద్ద సినిమాల్లో నటించి, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్ ముందుగా సంకోచించాడు. ఆ తర్వాత కథ విన్నాడు. అంతే.. మరో ఆలోచనే లేకుండా ఒప్పుకున్నాడు. పేరుకు వెబ్ సిరీస్ అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా సినిమా రేంజ్‌లో తీశారు. ఒక్కో ఎపిసోడ్ చూస్తుంటే రోమాలు నిక్క పొడుచుకునేలా ఉందీ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్య తీశారు. డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్‌లు మేళవించి తీసిన ఈ వెబ్ సిరీస్ కు లక్షల సంఖ్యలో వ్యూవ్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు తొలి సీజన్‌లో భాగంగా ఆరు ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. రెండో సీజన్‌లో మరిన్ని ఎపిసోడ్‌లు ఈ వెబ్ సిరీస్‌లో విడుదల చేస్తారు. ఒక్క ఎపిసోడ్ చూస్తే మిగతా ఎపిసోడ్‌లు కూడా చూడాలనిపించేలా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.
avadiki

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles