గడియారాల ప్రదర్శన!


Thu,January 24, 2019 12:18 AM

ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో ఎగ్జిబిషన్లు జరిగి ఉంటాయి. అక్కడ జరిగిన గడియారాల ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని వేల రకాల అరుదైన గడియారాలు ఒకేచోట ప్రదర్శనగా ఏర్పాటుచేసి అబ్బురపరిచారు. బ్రిటిష్ క్లాక్ మేకర్‌కు ఘన నివాళి అందించేందుకు ఈ పని చేశామంటున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ ఎక్కడ? ఏమిటా కథా?
largest-clock-expo
ఇంగ్లాండ్‌కు చెందిన ఉత్తర లింకైన్షెర్‌లో అరుదైన గడియారాలతో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో వంద, రెండు వందల రకాల క్లాక్‌లు కాదు దాదాపు 3వేల రకాలు అక్కడ కొలువుదీరాయి. ఇంత పెద్ద గడియారాల ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. అదేమిటంటే గడియారాన్ని తొలిసారిగా రూపొందించిన జాన్ హ్యారిసన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆయనకు ఘనంగా నివాళులందించాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున ఉత్తర లింకైన్షెర్‌లో క్లాక్స్ ఎగ్జిబిషన్‌ను పెట్టారు. జాన్ హ్యారిసన్ గడియారాన్ని కనుగొనడం వల్లనే నేడు అందరం క్లాక్‌ను వినియోగించగలుగుతున్నామని భావించిన కొందరు అభిమానులు కలిసి ఆయన స్మృత్యర్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం అరుదైన గడియారాలతో కూడిన ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో 3వేల క్లాక్స్‌ను ప్రదర్శన చివరి రోజున వేలం వేసి వచ్చిన మొత్తంతో జాన్ హ్యారిసన్ విగ్రహాన్ని రూపొందించేందుకు అవసరమైన నిధులు సమకూర్చారు.

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles