ఈ లవంగం చెట్టు వయసు..400 సంవత్సరాలు


Thu,January 24, 2019 12:18 AM

ఆశ్చర్యంగా ఉందా? అవును. నిజమే. ప్రపంచంలో అత్యంత పురాతనమైనవి చాలానే ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకూ చరిత్రకు ఎక్కినవి కొన్ని అయితే.. మరికొన్ని చరిత్ర పుటల్లోకి చేరలేదు. ఇక్కడ చెప్పుకోబోయే లవంగం చెట్టు సరిగ్గా ఆ కోవకు చెందిందే!
big-clove-tree
ఇండోనేషియాలోని సుగంధద్రవ్యాలు పండే దీవుల ప్రాంతంలో అత్యంత పురాతనమైన వృక్షాలు కనిపిస్తుంటాయి. ఇండోనేషియాలోనే టెర్నాటో అనే ప్రదేశం సుగంధ ద్రవ్యాలు పండే ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అతి పురాతనమైన లవంగం చెట్టు ఇప్పటికీ ఉన్నది. ఈ వృక్షం టెర్నాటో ప్రదేశానికి చారిత్రాత్మక గుర్తింపు కూడా వచ్చింది. ఇంతకీ ఆ లవంగం చెట్టు కాదు కాదు మహా వృక్షానికి ఎన్ని ఏండ్లో తెలుసా? అక్షరాలా నాలుగు వందల ఏండ్లు. ఏంటీ లవంగం చెట్టుకు 400సంవత్సరాలా? అని నోరు వెళ్ల బెట్టకండి. ఈ మహా వృక్షానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇండోనేషియాకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన జాబితాలో ఇదే ముందు వరుసలో ఉంటుంది. ఈ ద్వీపం సముద్ర మట్టానికి 6వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆసియా దేశాలకు ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మొత్తంలో సుగంధ ద్రవ్యాలు సరఫరా అవుతాయట. అబ్బురపరిచే ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియాలోని టెర్నాటో ఒకటి. ఆకుపచ్చని చెట్లతోపాటు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో దీవులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles