ఉతికి ఆరేయండిలా!


Wed,January 23, 2019 01:05 AM

clothing
-కుషన్ కవర్లపై ఉన్న లేబుల్‌లో పేర్కొన్న వివరాలను ఉతికే ముందు బాగా చదువాలి. లేదంటే కొన్ని రకాల సోఫా కవర్లను వేడినీటిలో ముంచితే పాడవుతాయి.
-సోఫా కవర్ వెనుక భాగంలోని చిన్న ముక్కను ముందుగా డిటర్జంట్‌తో ఉతికి ఆరేయండి. బట్ట రంగు పోకుండా ఉంటే కవర్‌ని పూర్తిగా ఉతుకండి.
-సోఫా కవర్లను సాధారణ నీటిలో 60 నిమిషాలు నానబెట్టాలి.
-సాధారణ నీటిలో కాకుండా డిటర్జంట్‌లో నానబెడితే 20 నిమిషాలు చాలు.
-వాషింగ్ మెషిన్‌లో కంటే చేతితో ఉతికితే మంచిది. ఉతికేటప్పుడు బ్రష్ వాడకూడదు.
-కవర్లు ఆరిన తరువాత ఐరన్ చేయాలి. ఇలా చేస్తే కవర్లు మెరువడమే కాకుండా దానికుండే బాక్టీరియా కూడా నశిస్తుంది.
-సోఫా కవర్లను ఉతుకడం కుదరకపోతే షాంపూని ఉపయోగించి మరకలను పోగొట్టొచ్చు. కాటన్ బట్టపై షాంపూ స్ప్రే చేసి మరక పోయేంతవరకు కవరుపై రుద్దాలి. ఇలానే కుషన్ కవర్లను చేయోచ్చు.

314
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles