సహజ కవయిత్రి


Tue,January 22, 2019 10:41 PM

కవిత్వం.. పొడి పొడి అక్షరాలే అయినా ఎంతో భావం ఉంటుంది. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచింపజేస్తుంది. కానీ ఇప్పుడెవరు రాస్తున్నారు అలాంటి కవితలు? ఏదైనా వస్తువును సునిశితంగా పరిశీలించడానికే సమయం దొరకని ఈ రోజుల్లో భావోద్వేగాలను పండించే కవులా? అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నది ఓ కశ్మీరీ యువతి.
Nawreen-Qadri
20 ఏండ్లకే అద్భుతమైన కవితలు రాస్తూ.. వినిపిస్తూ అందరి మెప్పు పొందిన కశ్మీరీ కవయిత్రి సయ్యద్ నవ్రీద్ ఖాద్రీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నది. ప్రేమ, అనురాగం, భావోద్వేగాలను జోడించిన కవితా సంకలనం ఇటీవల విడుదల చేసింది నవ్రీద్. ఒక కశ్మీరీ యువతి అయి ఉండి ఆంగ్లంలో అద్భుతమైన కవితలు రాసిందనే పేరు కూడా సంపాదించింది. కవితలు బయటకు వచ్చిన తర్వాత ఆమె గురించి చర్చించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో నవ్రీద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సిల్హ్‌టేస్ట్ పేరుతో కవితా సంకలనం జనాల్లోకి వెళ్లిన తర్వాత సాహితీ అభిమానులు ఆమెను పొగుడుతున్నారు. సహజ కవయిత్రి నవ్రీద్ అంటూ ఆమెను కీర్తిస్తున్నారు. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఆమె ఆరో తరగతి నుంచే ఆంగ్లంలో కవితలు రాస్తూ వస్తున్నది.

717
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles