సీపీఆర్‌తో గుండెపోటుకు చెక్!


Tue,January 22, 2019 01:33 AM

గుండెపోటు మరణాల్లో 50% ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గుండెపోటును గుర్తించగానే తక్షణమే సీపీఆర్ చేస్తే చాలావరకు మరణాలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు.
CPR
గుండెపోటును గుర్తించి చేసే ప్రథమ చికిత్సనే సీపీఆర్ అంటారు. సీపీఆర్ కేవలం వైద్యులు మాత్రమే కాకుండా కొద్దిపాటి శిక్షణ పొందిన వారెవరైనా చేయొచ్చు. దీనివల్ల రక్తంలో ఆక్సీజన్ శాతం పెరిగి.. అది మెదడుకు చేరి అవయవాలకు తగిన సంకేతాలనిస్తుంది. ఫలితంగా బాధితులు వేగంగా ప్రమాదం నుంచి బయటపడతారు. గుండెపోటు మరణాలను గణనీయంగా తగ్గించాలంటే ప్రతి ఒక్కరికీ సీపీఆర్ శిక్షణ అవసరం.
ఇది బ్రిటన్‌లో అమలులో ఉండి మంచి విజయాలు సాధించింది.


ఏం చేయాలి?

గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి. అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. బాధితుడి మెదడుకు 5-6 సెకండ్ల పాటు రక్తసరఫరా నిలిచిపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. అదే.. 40 సెకన్లు రక్త సరఫరా నిలిచిపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని గమనించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జాగ్రత్తలేమిటి?

సీపీఆర్‌కు ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడా లేదా గమనించాలి. ఆ వ్యక్తి స్పందించకపోతే పెద్దగా అరవాలి. సీపీఆర్ చేసేటప్పుడు భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. ప్రమాదం లేదని హామీ ఇవ్వాలి. ఒకవేళ అప్పటికే బాధితుడు సృహ కోల్పోయి స్పందించకపోతే అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వాలి. బాధితుడికి గాలి ఆడకుండా చుట్టూ జనాలు మూగితే వారంతా పక్కకు వెళ్లేలా చూడాలి.

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles