వెన్నునొప్పికి మూలం


Mon,January 21, 2019 11:31 PM

చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి . కూర్చుంటే నిలబడనీయదు. నిలబడితే కూర్చోనివ్వదు. రకరకాలుగా వేధిస్తూ ఏమీ చేయలేక ఎవ్వరికీ చెప్పుకోలేక బాధపడుతుంటారు చాలామంది. అసలు వెన్ను నొప్పికి కారణం ఏంటి? దానిని ఎలా నివారించాలి? తెలుసుకుందాం.
Spine

కారణాలేంటి?

-మితిమీరిన శరీర బరువు.
-ఎక్కువ దూరం బైక్ నడపటం.
-ఎక్కువకాలం మలబద్దక సమస్య ఉండటం.
-కాక్సిక్ ఎముక గాయపడి దానిచుట్టూ నరాల పనితీరు దెబ్బతినటం.

నివారణ ఎలా?
-ఎప్పుడూ ఒకే భంగిమలో కూర్చోకుండా లేచి తిరగాలి. వెనక్కి వాలి కూర్చోవాలి.
-పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలబద్దక సమస్య పరిష్కారం అవుతుంది.
-కుర్చీ మెత్తగా ఉండేలా చూసుకోవాలి. వెన్ను కింద మెత్తని దిండు పెట్టుకోవాలి.
-నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. దూరభారమని భావించకుండా గతుకుల రోడ్లకు బదులు మంచి రోడ్డును ఎంచుకోవాలి. నొప్పి అనిపించినప్పుడు వేడినీళ్లతో కాపాలి.
-సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles