తెలివైన నోటి పరికరం


Tue,January 22, 2019 01:09 AM

Aadhunika-Pokada
శరీర కండరాల సహనశీల శక్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తలు తెలివైన (స్మార్ట్) నోటి పరికరాన్ని తాజాగా అభివృద్ధి పరిచారు. దీనితో ముఖ్యంగా క్రీడాకారుల్లో లాక్టేట్ లెవల్స్ శ్రుతి మించకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు.

Aadhunika-Pokada2
క్రీడాకారులు పరుగు తీయడం వంటి వ్యాయామాలు చేసే సమయంలో కండరాలు (కణజాలం) వారికి తెలియకుండానే అధిక శ్రమకు లోనవుతాయి. దీని ఫలితంగా లాక్టేట్ (జీవ రసాయన పదార్థం) స్థాయి మరీ తీవ్రస్థాయిలో పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు వాటి లెవల్స్‌ను కొలవడానికి ఒక తెలివైన నోటి పరికరాన్ని (స్మార్ట్ మౌత్ గ్వార్డ్) శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి పరిచారు. దీనితో ప్రస్తుతం వాడకంలో ఉన్న రక్త పరీక్షల విధానం ద్వారా సదరు లెవల్స్‌ను తెలుసుకొనే అవసరం క్రీడాకారులకు ఉండదు. శిక్షణా సమయంలో క్రీడాకారులలో ఈ లెవల్స్ పడిపోవడం గానీ లేదా పెరగడం కానీ జరక్కుండా స్థిరస్థాయిలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. పై పరికరాన్ని నోటిలో అమర్చుకోవడం ద్వారా లాలాజలంలోని లాక్టిక్ పదార్థ స్థాయిల కొలతలను సేకరించుకోవచ్చు. అమెరికాలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, పాలో రీసర్చి సెంటర్ (పార్క్)లకు చెందిన పరిశోధకులు మెత్తని ఎలక్ట్రానిక్ స్మార్ట్ మౌత్ గ్వార్డ్ (Smart Mouth Guard) మూల నమూనాను రూపొందించారు. ఇది ప్లాస్టిక్‌తోనే తయారైనా ఇందులోని సెన్సర్లు నిరంతరం లాలాజల పర్యవేక్షణ జరుపుతుంటాయి. దీని బ్యాటరీ రీచార్జికి అనుకూలమేకాక తత్ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌కు చేరవేసే సౌకర్యం కూడా ఇందులో కల్పించారు.

568
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles