అతి మహోజ్వల క్వాజర్!


Tue,January 22, 2019 01:06 AM

Vishwa-Darshanam
సూర్యునికంటే 600 ట్రిలియన్ రెట్లు ప్రకాశవంతంగా వెలిగిపోతున్న అతి మహోజ్వల క్వాజర్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమికి 12.8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది.


భూమి నుంచి ఆకాశంలో మనకు కనిపించే అతిపెద్ద ఖగోళ వస్తువు నిస్సందేహంగా సూర్యుడే. కానీ, ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తల దృష్టికి వచ్చిన ఒక అతి మహోజ్వల క్వాజర్ ముందు మన ఆదిత్యుని కాంతి కేవలం 10 వాట్ల విద్యుత్ బల్బుతో సమానమే. ఇంత భారీస్థాయి క్వాజర్‌ను కనుగొనడం ఇదే మొదటిసారిగా వారు చెబుతున్నారు. దీని ప్రజ్వల కాంతి సుమారు 600 ట్రిలియన్ (1 ట్రిలియన్= లక్ష కోట్లు) సూర్యులకు సమానమని అంటున్నారు. జె043947.08+163415.7గా అధికారికంగా గుర్తించిన ఈ క్వాజర్ భూమికి 12.8 బిలియన్ (1 బిలియన్= 100 కోట్లు) కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వారంటున్నారు. విశ్వంలో ఒక సంక్లిష్టమైన నక్షత్రం మాదిరిగానే కనిపించే ఖగోళ వస్తువుగా క్వాజర్‌ను శాస్త్రవేత్తలు నిర్వచిస్తున్నారు. వీటి కేంద్రంలో మహోన్నత కాలబిలాలు ఉంటాయన్న అభిప్రాయమూ ఉంది. వీటినుండి అత్యంత శక్తివంతమైన విద్యదయస్కాంత కిరణాలు ఉత్పన్నమవుతున్నప్పటికీ గెలాక్సీలు అడ్డు వస్తుండడం వల్ల విశ్వంలో వీటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటున్నది. గ్రావిటేషనల్ లెన్సింగ్‌గా పిలిచే పటిష్ఠమైన భౌతికశాస్త్ర దృగ్విషయం ద్వారా ఇప్పుడు దీనిని గుర్తించినట్లు వారు చెబుతున్నారు.

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles