అఖాతాలతో పెనుముప్పు


Tue,January 22, 2019 01:03 AM

Pridhwee-Shastram
భూమ్మీది అఖాతాల ఉష్ణోగ్రత అత్యున్నత స్థాయికి చేరుకున్నట్టు పరిశోధకులు హెచ్చరించారు. 1952 నుంచీ పోల్చినప్పుడు 2018 నాటి ఉష్ణోగ్రతలే చరిత్రలో అత్యధికమని వారు వెల్లడించారు.


భూతాపం మితిమీరుతూ అఖాతాలు చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి వేడెక్కిపోతున్నాయి. అత్యంత కచ్చితపు కొలతలు తీసుకోవడం మొదలైన తర్వాత అంటే 1952- 2018 నడుమ పోల్చి చూసినప్పుడు ఉష్ణోగ్రతల పెరుగుదల అనూహ్య స్థాయికి చేరినట్లు చైనాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎట్మోస్పియర్ ఫిజిక్స్ ఒక పరిశోధనా పత్రంలో ఇటీవల వెల్లడించింది. 2017లో చైనా మొత్తం ఏడాదిపాటు వినియోగించిన విద్యుచ్ఛక్తికి ఇది 388 రెట్లు అధికమని వారు తెలిపారు. సుమారు 2,000 మీటర్ల (6,600 అడుగులు) లోతున సాగరగర్భంలోంచి వివిధ పరికరాలతో సేకరించిన సమాచారం ఆధారంగా దీనిని నిర్ధారించినట్లు వారు వెల్లడించారు. మరొక పరిశోధనా పత్రమైతే ఏకంగా క్రీ.శ. 1871కి- ఇప్పటికి నమోదైన పెరుగుదల యావత్ ప్రపంచం ఏడాది వినియోగం కన్నా 1,000 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. అఖాతాల ఉష్ణోగ్రతల్లోని అనూహ్య పెరుగుదలకు భూతాపమే కారణమని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పర్యవసానాల తీవ్రత మరింత అధికమై పెనుముప్పును మానవాళి ఎదుర్కొనక తప్పదనికూడా వారు సంయుక్తంగా హెచ్చరిస్తున్నారు.

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles