స్టంట్లతో కొత్త చరిత్ర


Mon,January 21, 2019 11:02 PM

ఇండియన్ ఆర్మీలో మహిళా జవాన్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎరుగని సవాళ్లను ఎదుర్కొంటూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ దిశగా సైన్యాధికారులు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో మహిళా జవాన్ల ధైర్యసాహసాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
woamn-dare-devil
ఇటీవల నిర్వహించిన ఆర్మీ డే పరేడ్‌లో సైనిక దళాధిపతిగా భావన కస్తూరి అనే మహిళా జవాన్ తొలిసారిగా నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీ నుంచి మరో మహిళా జవాన్ కొత్త రికార్డు సృష్టించనున్నారు. కెప్టెన్ శిఖ సురభి అనే మహిళా అధికారి.. బైక్‌లతో చేసే పిరమిడ్ (డేర్ డెవిల్స్ మోటర్‌సైకిల్ డిస్‌ప్లే)కు నాయకత్వం వహించనున్నారు. యేటా నిర్వహించే ఈ మోటార్ సైకిల్ డిస్‌ప్లేలో అందరూ పురుషులే పాల్గొంటారు. అయితే, ఈసారి సురభి ఆ టీంలో పాల్గొనడంతో పాటు.. నాయకత్వం వహించి చరిత్ర సృష్టించనున్నారు. గతంలో ఒక బైక్‌పై 61 మంది పిరమిడ్ డిస్‌ప్లే చేశారు. దీంతోపాటు 361 మంది జవాన్లు 13 బైక్‌లను నడిపి ఔరా అనిపించారు. అయితే ఈ సంవత్సరం నిర్వహించే డేర్‌డెవిల్స్ మోటార్ సైకిల్ డిస్‌ప్లేలో 9 మోటార్‌సైకిళ్లను నడిపే 33 మంది జవాన్ల బృందానికి సురభి నాయకత్వం వహిస్తారు.

477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles