ఆరోగ్యానికి అరటి


Mon,January 21, 2019 11:01 PM

ఏ సీజన్లోనైనా విరివిగా లభించే అరటి పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
banana
అరటి పండ్లు తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అరటి పండ్లు ఏ సీజన్లోనైనా విరివిగా లభిస్తాయి. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. చక్కెరకేళి, అమృతపాణి... ఇలా మన దేశంలో పలు రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. అరటి పండులో శరీరానికి సరిపడా క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇందులోని పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఉపయోగపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి.


ఈ పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తిన్న తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. బరువు పెరగాలని అనుకునే వారికి ప్రయోజనకరం. కండరాల బలహీనతను నివారించడంలో అరటిపండ్లు తోడ్పడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో.. ఎసిడిటీని దూరం చేయడంలో, అల్సర్లను తగ్గించడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం కావడానికి ఇవి ఉపయోగపడతాయి. డయెరియాతో బాధపడేవారు అరటి పండ్లు తింటే మంచిది.

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles