పనితనం


Tue,January 22, 2019 01:00 AM

Panitanam
మన శరీరానికి అత్యవసరమైన కీలక అంతర అవయవాలలో గుండె ఒకటి. ఇది ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరానికి అంతటికినీ కావలసిన శుద్ధ రక్తాన్ని పంపిణీ చేస్తుంది. తద్వారా కణజాలానికి కావలసిన ప్రాణవాయువు (ఆక్సీజన్), పోషకాలను సరఫరా చేస్తుంది. ఇదే సమయంలో బొగ్గుపులుసు వాయవు (కార్బన్ డై ఆక్సైడ్) తదితర వ్యర్థాలను తొలగిస్తుంది. దేహంలోని కణజాలాలన్నింటికీ నిరంతరం పోషకాలు అవసరమవుతాయి. కాబట్టే, ఈ పనిని గుండె నిర్వర్తిస్తుంది. దీనిద్వారా రక్తం పంపిణీ రెండు రకాలుగా జరుగుతుంది. అవి పుపుస (శ్వాస), దైహిక (శరీరం మొత్తానికి) ప్రసరణలు. పుపుస ప్రసరణ మార్గం గుండె నుండి ఆమ్లజని (ఆక్సీజన్) రహితమైన రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్లి, అక్కడ్నించి ఆమ్లజనితో కూడిన శుద్ధ రక్తాన్ని తిరిగి హృదయానికి చేరవేస్తుంది. దైహిక ప్రసరణంలో ఆమ్లజనితో కూడిన ఈ రక్తాన్ని శరీర అవయవాలకు అన్నింటికీ చేరవేస్తూ, ఆమ్లజని రహిత రక్తాన్ని తిరిగి గుండెకు చేరుస్తుంది. ఈ రకంగా ఆక్సీజన్‌తో కూడిన రక్తాన్ని శరీరం మొత్తానికి, ఆమ్లజని రహిత రక్తాన్ని శ్వాసకోశాలకు చేరవేయడంలో గుండె కీలకపాత్రను పోషిస్తుంది.

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles