ఇలా బ్రష్ చెయ్యండి


Mon,January 21, 2019 11:00 PM

ఉదయాన్నే లేచి చేసే పనిలో దంతాల శుభ్రత ముఖ్యమైంది. అయితే ఇష్టానుసారంగా ఈ పని చేయటం వల్ల దంతాల మీద ఉండే ఎనామెల్ పొర కరిగిపోయి, దంతాలు బలహీనంగా తయారవుతాయని డెంటిస్టులు అంటున్నారు. మరి బ్రష్ ఎలా చేయాలి?
brushing
-కొందరికి రోజులో ఒకసారి మాత్రమే బ్రష్ చేయటం అలవాటు. అలా కాకుండా సాయంత్రం పూట కూడా బ్రష్ చేయటం అలవాటు చేసుకోవాలి.
-బ్రష్, టూత్‌పేస్టుల ఎంపికలోనూ జాగ్రత్తలు పాటించాలి. నాణ్యమైనవాటినే వాడాలి. ఒకే బ్రాండ్‌ను వాడాలి. ప్రతిసారి కొత్తబ్రాండ్ వస్తువులను వాడటం వల్లకూడా సమస్యలు ఎదురవుతాయట.
-ముఖ్యంగా దంతాల మధ్య భాగంలో ఆహారం ఇరుక్కుపోతుంది. అక్కడే బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి పండ్ల మధ్యభాగంలో బాగా శుభ్రం చేయాలి.
-బ్రష్‌ను కూడా ఎక్కువ కాలం వాడటం మంచిది కాదు. వీలైనంత త్వరగా బ్రష్‌ను మార్చాలి.
-ఇటీవల మార్కెట్‌లోకి టంగ్ క్లీనర్లు కూడా వస్తున్నాయి. వీటి వినియోగం కూడా పెరిగింది. అయితే వీటిని ఉపయోగించి నాలుకను శుభ్రపరచాలి. అదీ మోతాదుకు మించకూడదు. మృధువుగా వాడాలి. గట్టిగా రుద్దడం వల్ల నాలుకపై ఉండే రుచిగులికలు పోయే ప్రమాదం ఉంది.

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles