సుచరిత


Tue,January 22, 2019 12:58 AM

Sucharitha
ఆధునిక మానవ చరిత్రలో తిండిగింజల్ని పిండిగా మార్చుకోవడం ఒక సంచలన ప్రగతి. ఇవాళ్టికి ఊరూర ఆధునిక పిండి గిర్నీలు కనిపిస్తున్నాయి. ముడిగింజలు, ధాన్యాన్ని గ్రైండ్ చేసే విధానం చాలా ఏండ్ల కిందటే మొదలైంది. విసుర్రాళ్లు, రోళ్లు వంటి వాటి కంటే చాలాముందు సుమారు క్రీ.పూ. 6000 ఏండ్ల కిందటే మనుషులు గోధుమలను పిండిగా మార్చుకొని ఆహారంగా ఉపయోగించినట్టు పురాతత్వ ఆధారాలు లభ్యమైనాయి. దీనికిగాను అప్పట్లో తేలికైన మిల్లురాళ్లను వాడినట్లు తెలుస్తున్నది. కోన్‌మిల్లు (శంఖాకారం) లను రోమన్లు తొలుత వాడారు. పారిశ్రామిక శకం మొదలయ్యాక క్రీ.శ. 1879లో లండన్‌లో మొట్టమొదటి స్టీమ్‌మిల్లును ఉపయోగించారు. 1940లలో మిల్లులతోపాటు పిండ్ల వాడకమూ హెచ్చింది. పిండిని పాడవకుండా, పురుగులు పట్టకుండా నిలువ వుంచుకోవడం ఇప్పటికీ పెద్ద సమస్యే. గింజల నాణ్యత, వాతావరణాన్ని బట్టి నిలువ సామర్థ్యం ఉంటుంది. రోగకారక క్రిములను తొలగించడం ద్వారా నిలువ సామర్థ్యాన్ని పెంచడంతో వాడకం మరింత అధికమైంది. ఇవాళ్టికి ఇంటింటికీ గ్రైండర్లు, మిక్సర్లు వచ్చినా పెద్ద పిండిగిర్నీల వాడకం తగ్గలేదు.

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles