సేవాభావం.. ఆమె వారసత్వ సంపద..


Sun,January 20, 2019 01:18 AM

చిన్నప్రాయంలోనే శరణార్థులను చూసి చలించింది. అనాథలను అక్కున చేర్చుకుంది. అప్పుడే సొంత ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది కన్నీళ్లు తుడుస్తున్నది ప్రసన్న బండారి. మహిళల, పిల్లల సంక్షేమంలో ఆమె కృషికి జమ్నాలాల్ బజాజ్ అవార్డు పొందింది.
benglr-women
కోల్‌కతాకు చెందిన ప్రసన్న 1934లో జన్మించింది. తండ్రి సామాజిక కార్యకర్తగా ఉండేవారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. అలా అమె బాల్యం గడిచింది. అప్పుడే జరిగిన బెంగాల్ విభజనలో శరణార్థుల కష్టాలు ఆమెను కలిచి వేశాయి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను చూసింది. సామాజిక బాధ్యతగా మరింత పని చేయాల్సి వచ్చింది. అనాథ శిశువులను, నిరాశ్రయులైన పిల్లలను చేరదీసింది. బాలికలకు, మహిళలకు, వృద్ధులకు ఎనలేని సాయం అందించింది. ప్రస్తుతం ఆమెకు 85 యేండ్లు. 55 ఏండ్లుగా సామాజిక సేవకు ఆమె అంకితమైంది. చిల్డ్రన్ హోమ్స్, ఓల్జెజ్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొదట 20 నుంచి 40 మంది పిల్లలతో స్థాపించిన చైల్డ్ హోం ప్రస్తుతం 450 మందితో నడుస్తున్నది. దీంతో వారికోసమే ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. 8 నుంచి 18 యేండ్లు అనాథ పిల్లలను చేరదీసి వాళ్లకు ప్రేమను పంచింది. బాలికలకు, బాలురకు వేర్వురుగా ఆశ్రయం కల్పించి విద్యాబుద్ధులు నేర్పింది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస ఆమెను కదిలించింది. దాని కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. అలా సుమారు 3500 సమస్యలను పరిష్కరించింది. ఇలా కౌన్సెలింగ్ చేసి కుటుంబాలను కలుపుతున్నది. అందరికీ అండగా ఉంటున్న ప్రసన్న తన జీవితాన్ని సేవకు అంకితం ఇచ్చినందుకు సంతోషిస్తున్నది. ఇతరులకు ఎలా సాయం చేయాలో అందరూ ఆలోచించాలనీ, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇతరుల కన్నీళ్లయినా తుడువగలగాలలని ప్రసన్న అంటున్నది.

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles