రణ్‌వీర్.. పెండ్లి తర్వాత!


Sat,January 19, 2019 11:01 PM

పెండ్లయిన కొత్తలో భర్తకు కొన్ని షరతులు విధిస్తుంటారు ఆడవాళ్లు. వాటిని కొందరు భర్తలు సంతోషంగా స్వీకరిస్తారు కూడా. మితిమీరిన షరతులతో కొన్ని ఇబ్బందులూ ఎదురవుతుంటాయి. తాజాగా విడుదలైన ఎఫ్ 2 సినిమాలో ఈ విషయాన్ని చాలా చక్కగా చూపించారు కూడా. అయితే.. ఇటీవల దీపిక పదుకొణెను పెండ్లి చేసుకున్న రణ్‌వీర్ పరిస్థితి కూడా ఎఫ్2 మాదిరిగానే ఉందట.
deepika-Padukone
ఒక మనిషి గురించి చెప్పాలంటే.. పెండ్లికి ముందు, పెండ్లి తర్వాత అంటూ ఎఫ్2 సినిమాలో వెంకీ చెప్పే డైలాగు వినోదభరితంగా ఉంటుంది. పెండ్లికి ముందు తిరిగినట్లుగా.. పైండ్లెన తర్వాత కూడా తిరిగితే భార్యలు ఊరుకుంటారా? అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్. ఎందుకంటే పెండ్లికి ముందు నైట్‌పార్టీలు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ అంటూ తిరిగిన రణ్‌వీర్‌కు పెండ్లి తర్వాత దీపికా కొన్ని కొత్త షరతులు విధించిందట. వాటితో తన స్వేచ్ఛా జీవితానికి చరమగీతం పాడుతుందని చమత్కరిస్తున్నాడు రణ్‌వీర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణ్‌వీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా పెళ్లి తర్వాత రణ్‌వీర్‌కు దీపికా మూడు కండిషన్స్ పెట్టిందట. అందులో మొదటిది ఇంటికి ఆలస్యంగా రాకూడదు. రెండోది ఇంటి నుంచి ఏమీ తినకుండా బయటకు వెళ్లకూడదు. ముచ్చటగా మూడో విషయానికొస్తే.. ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ఈ మూడూ సమంజసంగానే ఉండడంతో రణ్‌వీర్ ఫ్రస్ట్రేషన్‌తో కాకుండా ఫన్‌తో ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్నాడు. అయితే, మొత్తానికి పెండ్లి తర్వాత దీపికా.. తన మొగుడ్ని కొంగున కట్టేసుకుందని బాలీవుడ్‌లో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

718
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles