భార్యతో గొడవ పడుతున్నారా?


Sat,January 19, 2019 11:01 PM

ఏమండోయ్.. చీటికి మాటికి మీ భార్యతో గొడవ పడుతున్నారా? అయితే మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తాజాగా జరిపిన ఓ పరిశోధన ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
Wife-and-Husbend
ఈ మధ్యకాలంలో చాలామందిని వేధించే సమస్య షుగర్ వ్యాధి. ఆహారపు అలవాట్లు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు. ఈ వ్యాధి చిన్నవయసులోనే దాడిచేస్తుంది. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చెబుతున్న దాని ప్రకారం.. తరచూ భార్యతో గొడవపడేవారికి షుగర్ త్వరగా వస్తుందట. అంతేకాదు, ఆర్థ్రయిటిస్ సమస్య కూడా దాడి చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఆర్థ్రయిటిస్, మధుమేహం సమస్యలు ఉన్న రెండు వర్గాల వ్యక్తుల మీద పరిశోధన జరిపారు. భార్యతో తగాదాలు పడ్డవాళ్లకు అదే రోజున వారి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరిగినట్టు చెప్పారు. కాబట్టి.. సరైన జీవనవిధానంతో జీవితభాగస్వామితో కూడా సరిగా ఉంటే ఆరోగ్యానికి మేలు అంటున్నారు.

837
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles