వైరల్ గుడ్డుతో పోటీ!


Sat,January 19, 2019 11:00 PM

ఇన్‌స్టాగ్రాంలో వరల్డ్ రికార్డ్ ఎగ్ వైరల్ అవుతున్నది. గోధుమ రంగులో ఉన్న ఈ గుడ్డును ఇప్పటికే 4 కోట్ల మందికిపైగా లైక్ చేశారు. దీంతో ఈ గుడ్డు ఇన్‌స్టాగ్రాంలో ఎక్కుమంది లైక్ చేసిన పోస్టుగా రికార్డు సృష్టించింది. అయితే.. ఈ పోస్టుకు కౌంటర్‌గా
ఓ వ్యక్తి తన తలను గుడ్డులా మార్చుకొని పోటీకి దిగుతున్నాడు.

Egg-Man
ఇన్‌స్టాగ్రాంలో ఈ బ్రౌన్ కలర్ ఎగ్.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఈ గుడ్డు ప్లేసులో మనిషి ఉండి, అతను వరల్డ్ రికార్డ్ సాధిస్తే.. ఎలా ఫీలవుతాడు? ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అనే విషయాన్ని వివరించేందుకు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్యాట్రిక్ స్టార్ ముందుకొచ్చాడు. ఇందుకు తనను తాను గుడ్డులా మార్చేసుకున్నాడు. తానే మేకప్ వేసుకొని, గుడ్డు హావభావాలు పలికిస్తూ ఓ వీడియో రూపొందించాడు. ఇప్పుడా వీడియో.. గుడ్డుతో పాటుగా లైక్స్‌ను సొంతం చేసుకుంటున్నది. ఈ వీడియోకి యూట్యూబ్ ప్రత్యేక ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పటికే వైవిధ్యభరిత మేకప్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్యాట్రిక్.. ఇన్‌స్టాగ్రాం ఎగ్ వీడియోతో మరోసారి అందరినీ ఆలోచనలో పడేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇన్‌స్టాగ్రాం గుడ్డు గురించి మాట్లాడుకుంటున్నది. ఈ ఎగ్ పోస్ట్‌ని ప్రేరణగా తీసుకొని ఇన్‌స్టాగ్రాంలో వేలాదిగా ఎగ్ పోస్టులు పుట్టుకొస్తున్నాయి.

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles