వాళ్లే పుకార్లు షేర్ చేస్తున్నారు!


Sat,January 19, 2019 10:59 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ చేరువయ్యాక.. ఫేక్ న్యూస్‌తో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ వరకూ వచ్చిన విషయంలో నిజమెంతో, అబద్ధమెంతో తెలుసుకోకుండానే షేర్ చేస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్‌ను షేర్ చేసే వాళ్లలో ఎక్కుమంది పెద్దలే.
Viral-Old-mens
సోషల్ మీడియా ఎంతగా యాక్టివ్ అయ్యిందో.. దాని పుణ్యమా అని ఫేక్ న్యూస్ కూడా అదేవిధంగా వైరల్ అవుతున్నది. అయితే ఫేక్‌న్యూస్‌ను ఎవరెక్కువ షేర్ చేస్తారో తెలుసా? 65 ఏళ్ల వయసు పైబడినవారేనట. ఇది తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైన విషయం. దీని ప్రకారం 65 యేండ్ల పెద్దలు.. యువకులకంటే ఎక్కువగా ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు స్పష్టమైంది. లెస్ దెన్ యు థింక్ : ప్రిలివెన్స్ అండ్ ప్రెడిక్టర్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ డిస్సిమినేషన్ ఆన్ ఫేస్‌బుక్ పేరిట న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. ఇందులో 65 సంవత్సరాల వయసున్న వారు ఎక్కువగా ఈ ఫేక్ న్యూస్‌ను చూస్తున్నట్టు, వాటిని ఎక్కువగా తమ స్నేహితులకు షేర్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు వెల్లడైంది. యువకులు కేవలం 3 శాతం మంది మాత్రమే ఫేక్ న్యూస్‌ను షేర్ చేస్తున్నారన్నది ఈ పరిశోధన సారాంశం.

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles