ప్రకృతి బిడ్డలకు అండగా..


Sat,January 19, 2019 01:38 AM

అందమైన పర్వతాలు, విలువైన అటవీ సంపద.. అంతా గిరిజనుల పరిధిలో ఉంది. కానీ వీటిని సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. వాళ్ల కోసం ఓ మహిళ ముందుకొచ్చింది. సుమారు 26 యేండ్ల నుంచి వాళ్లకు పని నేర్పి ఉపాధి కల్పిస్తున్నది.
woman-kukudu
తమిళనాడులోరి ఊటీ, కునూర్ సమీపంలో ఉంది నీలగిరి జీవావరణ రిజర్వాయర్.. అటవీ సంపద, పర్వతాలు, నీరు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల వృక్షజాతులకు, జంతు జాతులకు నిలయంగానూ ఉంది. ఈ ప్రాంతంలో తడాస్, ఇరుల్లాస్, కురుంబస్, పినియాస్, ఆదియాస్ వంటి గిరిజన తెగల ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే చుట్టు పక్కల ఉన్న సంపదను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వారికి సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితిని గమనించిన సామాజిక కార్యకర్త స్నేహలత నాథ్ వాళ్లకు అండగా నిలిచింది. సంప్రదాయ వృత్తులను కాపాడాలనే లక్ష్యంతో స్నేహలత ఢిల్లీలోని ఓ ఎన్జీవోలో పనిచేసేది. తర్వాత తాము ఢిల్లీకే పరిమితం కావొద్దనే ఆలోచనతో 1993లో కీ స్టోన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రిమోట్ ఏరియాల్లోని గిరిజనులకు చేరువైంది. వాళ్ల పరిధిలో ఉన్న సహజ వనరుల గురించి వారికి వివరించి, వాటిని సరైన దిశలో ఉపయోగించడం నేర్పింది. గిరిజనుల్లో కమ్యూనిటీలను ఏర్పాటు చేసి చేతివృత్తులను, సేంద్రియ వ్యవసాయాన్ని, సంస్కృతిని కాపాడడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యాలు. దీంతో పాటు పర్వత శ్రేణుల్లో ఉండే గిరిజనులకు టెక్నాలజీ సాయంతో జీవనోపాధి చూపిస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతలను పెంపొందించడానికి స్థానికులకు శిక్షణ ఇస్తున్నది. స్వచ్ఛమైన తేనె తీయడం ఇక్కడి గిజరిజనుల ప్రధాన జీవనోపాధి. సంప్రదాయ వృత్తులకు సాంకేతికత, ఆధునికత జోడించడంలో స్నేహలత విజయం సాధించింది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల వాడకం పెరిగాక అక్కడి ప్రజల సమస్యలు చాలా వరకూ తగ్గాయి.

632
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles