26 అంతస్తుల మై హోమ్ క్రిష్


Sat,January 19, 2019 01:21 AM

Krishe-Ext
నిర్మాణ రంగంలో ముప్పయ్ ఎనిమిదేండ్ల అనుభవం గల సంస్థ ఏదైనా ఉందా అంటే.. ప్రతిఒక్కరికీ ముందుగా మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ గుర్తుకొస్తుంది. ఇప్పటివరకూ దాదాపు పదిహేనుకు పైగా అతిపెద్ద ప్రాజెక్టులను కొనుగోలుదారులకు విజయవంతంగా అందజేసింది. ఆకాశహర్మ్యాలను నిర్మించడంలో ఘనమైన చరిత్ర గల మైహోమ్.. గచ్చిబౌలి చేరువలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మైహోమ్ క్రిష్ అనే సరికొత్త లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నది. రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టులో.. అతితక్కువ కాలంలోనే అమ్మకాలూ 90 శాతం పూర్తి కావడం విశేషం.

మై హోమ్ క్రిష్‌ను దాదాపు 6.70 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నాలుగు బ్లాకుల్లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 650. ఒక్కో బ్లాకు ఎత్తు సుమారు 26 అంతస్తులు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులో రెండు పడక గదుల ఫ్లాట్ విస్తీర్ణం.. 1,275 చదరపు అడుగుల నుంచి ఆరంభమవుతుంది. అదే త్రీ బెడ్‌రూం ఫ్లాట్ల విషయానికొస్తే.. 1740, 1835, 2160, 2780 చదరపు అడుగుల్లో లభిస్తాయి. నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీపడని మైహోమ్ సంస్థ.. ఆధునిక సదుపాయాల్ని పొందుపర్చడంలో తన ప్రత్యేకతను నిరూపిస్తున్నది. కేవలం క్లబ్‌హౌజును 37 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నది. ప్రాజెక్టులో చేపడుతున్న సెంట్రల్ ల్యాండ్ స్కేప్ ప్రాంతాన్ని చూస్తే ఎవరికైనా చూడ ముచ్చటేస్తుంది. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఔట్‌డోర్ బాస్కెట్‌బాల్, టెన్నిస్ కోర్టులు వంటివి పొందుపరుస్తున్నది. ప్రస్తుతం ఎనిమిదో అంతస్తులో ఆర్‌సీసీ పనులు పూర్తయ్యాయి. 2020 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సంస్థ చెబుతున్నది.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles