కంచి.. పదహరణాల పట్టు!


Fri,January 11, 2019 01:15 AM

పిండి వంటల ఘుమఘుమలు.. హరిదాసు కీర్తనలు.. ముంగిట్లో రంగవల్లులు.. పడచుల పరికిణీల మెరుపులు.. గాజుల గలగలలు.. ఉంటేనే సంక్రాంతి పండుగకు అర్థం.. ఆనందం. మరి ఈ పండుగ పూట.. పదహారణాల పడుచులా ఉండాలంటే.. కంచి పట్టు పరికిణీలు కట్టాల్సిందే! పర్‌ఫెక్ట్ మ్యాచింగ్‌లు.. కత్తిలాంటి కాంట్రాస్ట్‌లు.. మిమ్మల్ని వలవేసి మరి లాగేలా ఉండే ఈ డిజైన్‌లపై ఓ లుక్కేయండి.
Fashan
1. ఎవర్‌గ్రీన్ కాంబినేషన్ అంటే ఇదే! ఆకుపచ్చని కాంజీవరం పట్టు లంగా మీద గోల్డెన్ పోల్కా డాట్స్ వచ్చాయి. దీనికి సరిగ్గా సరిపోయేలా ఎర్రని పెద్ద బార్డర్ అదిరిపోయింది. ఇదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించి బ్లౌజ్ కుట్టాం. బార్డర్‌కి మ్యాచింగ్‌గా ఉండేలా ఎర్రని నెట్ దుపట్టాని ఎంచుకున్నాం. దీనికి గోల్డెన్ బార్డర్, అక్కడక్కడ గోల్డెన్ వర్క్ చేశారు.

2. వంకాయ రంగు ప్లెయిన్ లెహంగా మీద జర్దోసీ, స్టోన్ వర్క్‌తో బుటీస్ ఇచ్చాం. దీనికి యాంటిక్ రెడ్, గోల్డెన్ కాంబినేషన్ ఉన్న పెద్ద బార్డర్‌ని జతచేశాం. ఎర్రని బ్లౌజ్‌కి జర్దోసీ వర్క్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. కేవలం స్లీవ్స్ మీద మాత్రమే వర్క్ చేయించాం. ఆకుపచ్చని నెట్ దుపట్టాకి అక్కడక్కడ బుటీస్ ఇచ్చి.. చివరన వంకాయ రంగు రాసిల్క్, గోల్డెన్ బార్డర్‌ని జతచేశాం.

3. ఎర్రని ప్యూర్ పట్టు మీద జర్దోసీ, ముత్యాలతో హెవీగా వర్క్ చేయించాం. దీనికి కంచిపట్టు బ్లూ డబుల్ బార్డర్‌ని జతచేశాం. బ్లూ కలర్ సిల్క్ బ్లౌజ్ మీద కూడా హెవీగా జర్దోసీ వర్క్ చేయించి, స్లీవ్స్‌కి కంచి పట్టు బార్డర్‌ని ఇచ్చాం. కాంట్రాస్ట్‌గా ఉండాలని యెల్లో నెట్ దుపట్టాకి గోల్డెన్, రాసిల్క్ బార్డర్‌లతో హైలైట్ చేశాం.

పవులూరి నాగతేజ
ఫ్యాషన్ డిజైనర్, తేజ శారీస్
కూకట్‌పల్లి, హైదరాబాద్
tejasarees@yahoo.com

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles