వెకేషన్‌కో, హాలీడేస్లోనో టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ప్రయాణంలో డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే టూర్ మొత్తం అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటే కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అందుకే టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కింది చిట్కాలు దృష్టిలో పెట్టుకోవాలి.

-డ్రైఫ్రూట్స్, నట్స్, పండ్లను తీసుకెళ్లాలి. ట్రావెలింగ్ హెల్దీ స్నాక్స్ అంటే ఇవే. ఎనర్జీ లెవెల్స్‌ను పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వాల్నట్స్, పిస్తా, బాదం, క్రాన్బెరీ వంటి వాటిని ఎంచుకోవచ్చు. దొరికిన ఆహారాన్ని అతిగా కాకుండా మితంగా తింటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే టూర్లో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
-ప్రతి రెండు గంటలకొకసారి కొద్దిగా ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ బాగా అవుతుంది. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. తాజా పండ్లు తీసుకోవాలి.
-సోడా, కూల్‌డ్రింక్స్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. దీనివల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండటమే కాకుండా హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. చీజ్, బీన్స్, చేపలు వంటి వాటిలో ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి హార్మోన్ల నియంత్రణలో బాగా ఉపయోగ పడతాయి. తరచుగా నీళ్లు తాగుతుండాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
-టూర్‌కు వెళ్లినపుడు రెస్టారెంట్లలో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినవలసివస్తే సాస్, ఫ్రైడ్ ఫుడ్, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.