జోగ్ అందాలు చూడతరమా


Fri,January 11, 2019 01:10 AM

jog-falls
భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా సాగర తాలూకాలో ఉంది. ఈ జలపాతం శరావతి నది, 253 మీటర్ల (829 అడుగులు) ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడున్నది. ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి గేరుసొప్ప లేదా జోగోడా గుండి అనే పేర్లు కూడా ఉన్నాయి. షిమోగ నుంచి జోగ్ జలపాతానికి బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. శరావతి నది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి, వేర్వేరు ధారలుగా పడుతాయి.రాజ: జలపాతం చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజు మాదిరిగా ఉండడం వల్ల దీనికి రాజు అని పేరు పెట్టారు.రోరర్: ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కింద పడుతుండడం వల్ల రోరర్ అని పేరు పెట్టారు.
రాకెట్: అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు మాదిరిగా ఉండడం వల్ల దీనికి రాకెట్టు అని పేరు. రాణి: వయ్యారాలు, వంపులు పోతూ పడే రాణి అని పిలుస్తారు.

950
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles