మాన్‌సూన్ ఆహారం!


Thu,July 19, 2018 12:57 AM

nutri.jpg
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పిల్లలు, పెద్దవాళ్లు ఇవి పాటించాలి.
-ఫాస్ట్‌ఫుడ్‌ల జోలికి వెళ్లకూడదు. రోడ్డు పక్కన ఉండే స్టాల్‌లో స్నాక్‌లు గట్రా తినకూడదు. ఇలాంటి ఆహారాలు ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి.
-వర్షకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆకలి మందగిస్తుంది. అందుకే ఆయిల్ ఫుడ్‌ని తినొద్దు. ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే దాన్ని ప్రిపేర్ చేసుకోండి.
-శక్తిని పొందాలంటే పండ్లు ఎంతో ఉపకరిస్తాయి. బేరి, ఆపిల్, దానిమ్మ పండ్లు ఈ కాలంలో బాగా తినాలి. ఈ కాలంలో జ్యూస్‌ల గట్రా జోలికి వెళ్లకూడదు. వీలైతే ఇంట్లోనే లస్సీ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో సూప్‌లలాంటివి తయారుచేసుకోండి. ఇందులో లవంగాలు, వెల్లుల్లిలాంటివి చేర్చండి.
-ఈ కాలంలో నీటిద్వారా అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కాచి వడబోసిన నీటినే తాగాలి. ఫిల్టర్ చేయడం, ప్యూరిఫయర్‌ల ద్వారా వచ్చిన నీటినే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీటిలోని సూక్ష్మక్రిములు నాశనమవుతాయి.
-ఈ కాలమనే కాదు.. ఏ కాలంలోనైనా వేయించిన, స్పైసీ ఫుడ్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. వీటివల్ల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తినకుండా ఉండాలి.
Mayuri.jpg

2400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles