వైద్య శాస్త్రంలో ఎన్నో చికిత్సా విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఆర్ట్ థెరపీ. రకరకాల వ్యాధుల నుంచి స్వస్థత కలిగించేందుకు కళా చికిత్స ఉపయోగపడుతుందని నమ్మేవారు ఎంతోమంది. మనో రుగ్మతల నివారణకూ ఈ విధానం తోడ్పడుతుంది. మానసిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న ఝార్ఖండ్ మహిళలకు ఆన్లైన్లో ఆర్ట్ థెరపీ ద్వారా చికిత్స చేస్తున్నది బెంగళూరుకు చెందిన ‘ఆర్ట్ మంత్రం’ సంస్థ. ‘నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే బాధితులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. మంత్రగత్తెలనే నెపంతో చాలామంది మహిళలను ఊళ్లలోంచి తరిమేస్తున్నారు. అత్యాచారాలు, హత్యలుకూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలను అతి దగ్గర నుంచీ చూస్తున్న మిగతా మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. పెయింటింగ్స్ ద్వారా బాధితుల్లో పాజిటివ్ దృక్పథాన్ని కలిగించడం మా లక్ష్యం’ అంటున్నారు ‘ఆర్ట్ మంత్ర’ క్రియేటివ్ డైరెక్టర్ ఎలీనా అబ్రహం.