e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆరోగ్యం మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !

మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !

మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !

మెదడు.. చుట్టూ పుర్రెతో కప్పబడి ఉంటుంది. కాబట్టి, ప్రమాదకరం కాని గడ్డ ఉన్నా అధికమైన ఒత్తిడితో ఇతర సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ. తొలిదశలో సాధారణ సమస్యలాగా కన్పించే క్యాన్సర్‌ తీవ్రమయ్యే కొద్దీ దగ్గు, తలనొప్పి, వికారం, వాంతులు, మానని పుండు, అలసట, ఆకలి, బరువు తగ్గటం జ్వరం మొదలైన లక్షణాలు వీడకుండా, తగ్గకుండా తీవ్రమవుతూ ఉంటాయి

శరీరంలో ఏ భాగానికైనా వచ్చే క్యాన్సర్స్‌ దాదాపు వంద రకాలకు పైగా ఉండటమే కాకుండా, వాటిలో మళ్లీ ఎన్నో సబ్‌ టైపులు కూడా ఉంటాయి. సాధారణంగా మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడటం, పాత కణాలు అంతరించి పోవటం అనే ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ సమతుల్యత దెబ్బతిని కొత్త కణాలు అపరిమితంగా పెరిగిపోవటమే క్యాన్సర్‌. కచ్చితంగా కారణం ఇదీ అని తెలియక పోయినా స్మోకింగ్‌, దురలవాట్లు, కొన్ని రకాల వైరస్‌లు, రసాయనాలు, రేడియేషన్‌ వంటివి క్యాన్సర్‌ కణం పుట్టుకకు కారణం అయ్యే ప్రమాదం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అందుకే కొన్ని వృత్తులలోని వారికి కొన్ని రకాల క్యాన్సర్స్‌ వచ్చే ప్రమాదాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాము.

- Advertisement -

గడ్డలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ప్రమాదం లేని గడ్డలను బినైన్‌ ట్యూమర్స్‌ అని, హానికర గడ్డలను మాలిగ్నెంట్‌ ట్యూమర్స్‌ అనీ అంటారు. బినైన్‌ (Benign) ట్యూమర్స్‌ ప్రాణాపాయం కానివి. ఇతర శరీర భాగాలకు, చుట్టు పక్కల కణజాలంలోకి ప్రవేశించలేవు. చిన్న పాటి శస్త్రచికిత్స ద్వారా వీటిని పూర్తిగా తొలగించవచ్చు. కాని ప్రాణాపాయ గడ్డలు చుట్టు పక్కల కణజాలంలోకి, లింఫ్‌ ప్రవాహం ద్వారా ఇతర శరీర భాగాలకు వ్యాపించి, అక్కడ కొత్త గడ్డలను ఏర్పరచగలుగుతాయి. మెదడులో ఏ రకమైన గడ్డ అయినా ప్రమాదకరమే. ఎందుకంటే మెదడు చుట్టూ పుర్రెతో కప్పబడి ఉంటుంది. కాబట్టి, ప్రమాదకరం కాని గడ్డ ఉన్నా అధికమైన ఒత్తిడితో ఇతర సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ. తొలిదశలో సాధారణ సమస్యలాగా కన్పించే క్యాన్సర్‌ తీవ్రమయ్యే కొద్దీ దగ్గు, తలనొప్పి, వికారం, వాంతులు, మానని పుండు, అలసట, ఆకలి, బరువు తగ్గటం జ్వరం మొదలైన లక్షణాలు వీడకుండా, తగ్గకుండా తీవ్రమవుతూ ఉంటాయి. ముదిరిపోవటాన్ని TNM సిస్టమ్‌ ద్వారా గుర్తిస్తారు. T అంటే (Tumor) గడ్డ, N అంటే లింఫోసోడ్స్‌, M అంటే మెటాస్టాసిస్‌ (ఇతర భాగాలకు వ్యాపించటం). వీటి తీవ్రతను బట్టి క్యాన్సర్‌ దశను నిర్ధారిస్తారు. క్యాన్సర్‌ కణాలను పరిశీలించినప్పుడు కణం, కణాంతర్భాగం అసాధారణ షేపులలో కన్పిస్తాయి. ఒక కణానికి ఇంకొక కణానికి ఆకారంలో పొంతన లేకుండా ఉంటాయి. కణాల అమరిక క్రమంగా లేకపోవటంతోపాటు అపరిమితంగా పెరిగిపోతుంటాయి. కాబట్టి, గడ్డ సైజు విపరీతంగా పెరిగిపోతూంటుంది.

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్స్‌ వారి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్‌ తీవ్రత, ఇతర భాగాలకు వ్యాపించిందా లేదా అన్న విషయాలు మీద ఆధారపడి ఉంటాయి. అందుకే పర్సనలైజ్‌డ్‌ చికిత్సా విధానాల ప్రాముఖ్యం పెరుగుతున్నది. బ్రెయిన్‌, బ్రెస్ట్‌, లంగ్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌.. అని రకరకాలుగా ఉన్నా, మళ్లీ వాటిలో ఎన్నోరకాలుగా విభజించి ఉంటాయి. ఒక్క బ్రెస్ట్‌ క్యాన్సర్‌నే తీసుకుంటే 10 రకాలకు పైన ఉన్నాయి. టైపును బట్టి కొన్ని సందర్భాలలో హార్మోన్‌ థెరపీ అవసరం కూడా ఉంటుంది. ఈ సబ్‌ టైపులలో కొన్ని తరచుగా కన్పించేవే కాకుండా, చికిత్సలకు కూడా త్వరగా లొంగుతాయి. క్యాన్సర్‌ కణితి తొలిదశలో నొప్పి లేకుండా చాలా గట్టిగా ఉంటుంది. క్యాన్సర్‌ పేర్లు వినేటప్పుడు మనకు కార్సినోమా, సార్కోమా, లింఫోమా, ల్యుకేమియా వంటి పదాలు వినబడుతూ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

  1. కార్సినోమా (Carcinoma) : చర్మం, అంతర్గత అవయవాల లోపల పొర లేక బాహ్యపొరలమీద వచ్చే క్యాన్సర్‌.
  2. సార్కో మా (Sarcoma) : ఎముకలు, కొవ్వు, కార్టిలేజి (Cartilage) రక్తనాళాలు, లేక ఆయా అవయవాలను పట్టి ఉంచే కణజాలానికి వచ్చే క్యాన్సర్‌.
  3. లింఫోమా (Lymphoma) : రోగనిరోధక వ్యవస్థకు చెందిన లింఫ్‌ గ్రంథులు, సంబంధిత కణజాలానికి వచ్చే క్యాన్సర్‌.
  4. ల్యుకేమియా (Leukemia): ఎముకల మజ్జలో తయారయ్యే రక్తకణాలలో క్యాన్సర్‌.

క్యాన్సర్‌ వచ్చిన భాగానికి ముందుగా వీటిని ఇంటి పేరులా వాడి క్యాన్సర్‌ రకాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు లాటిన్‌ భాషలో ఎముకను ‘ఆస్టియో’ అంటారు. క్యాన్సరును ఆస్టియో సార్కోమాగా పరిగణిస్తారు. అలాగే గ్రంథులను లాటిన్లో’ అడినో అని, గ్రంథుల కణజాలానికి వచ్చే క్యాన్సర్‌ను ‘అడినో కార్సినోమా’ అని అంటారు. వక్షోజాలలో గ్రంథుల కణాలకు సోకే క్యాన్సర్‌ ‘బ్రెస్ట్‌ అడినో కార్సినోమా’ అంటారు. క్యాన్సర్‌ ముందు తగిలించే లాటిన్‌ పదాలు ఇంకా కాడ్రో, ఎరిత్రో, హిమాంజియో, హెపటో, లైపో మెలనో, మైలో, మయో ఇలా అనేక రకాలుగా.. ఇంటిపేరులో Prefixలా ఉంటాయి.
ఇతర ఆరోగ్య సమస్యలను నిర్ధారించాక ట్రీట్‌మెంట్స్‌ తేలికగా ఉండటమే కాక చాలా మట్టుకు ఒక నిర్దిష్టకాలంలో అయిపోతాయి. కాని క్యాన్సర్‌ చికిత్సా విధానాలు సంక్లిష్టమైనవి. నిర్ధారించటానికి, ట్రీట్‌మెంట్స్‌ ఇవ్వటానికి, చికిత్సలు అయిపోయాక ఫాలోఅప్‌ కేర్‌కు వివిధ స్పెషలిస్ట్‌ల సమిష్టి కృషి చాలా అవసరం. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ పాత్ర చాలా ప్రముఖమైంది. అంతేకాకుండా, చికిత్సలకు ముందూ తర్వాత మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ పాత్రలు కూడా చాలా కీలకమైనవి. బ్లడ్‌ క్యాన్సర్‌కు తప్పితే మిగతా అన్ని క్యాన్సర్స్‌కు సర్జరీ, రేడియేషన్‌, కీమోథెరపి దాదాపుగా తప్పనిసరి. ‘క్యాన్సర్‌ చికిత్సకు లొంగటం లేదు’ అని తెలిస్తే దాదాపు లేటు దశ అని అర్థం చేసుకోవచ్చు. ఇతర శరీరభాగాలకు కూడా పాకిపోయినప్పుడు మందులతోనే మేనేజ్‌ చేస్తారు. బయటకు కన్పించే అవయవాల క్యాన్సర్‌ను ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా, కచ్చితంగా నిర్ధారించటానికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సిటి స్కాన్‌ (CT), న్యూక్లియర్‌ స్కాన్‌, MRI స్కాన్‌, PET స్కాన్‌, బయాప్సీ, ఫైన్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌ సైటాలజీ (FNAC), బ్లడ్‌ మార్కర్స్‌ (AFP.CA125, CEA, DR70) మొదలైన పరీక్షలను అవసరాన్ని బట్టి చేస్తారు. అంతేకాకుండా క్యాన్సర్‌ తిరగబెట్టే లక్షణం ఎక్కువ కాబట్టి, ట్రీట్‌మెంట్స్‌ అయిపోయాక మొదటి ఐదు సంవత్సరాల వరకు ఫాలో అప్‌ అవసరం. అవసరమైన పరీక్షలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఐదు సంవత్సరాలలో క్యాన్సర్‌ తిరిగి రాకపోతే దాదాపుగా పూర్తిగా నయం అయినట్లే. కానీ, కొంత మందిలో 10, 20 సంవత్సరాల తర్వాత కూడా కన్పించిన సందర్భలున్నాయి. కాబట్టి, ‘క్యాన్సర్‌ అదుపులో ఉంది’ అని మాత్రమే అంటారు.

డాక్టర్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌: 9848011421
కర్నూల్‌: 08518-273001
గుంటూర్‌: 0863-2223300

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !
మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !
మెదడులో ఏ గడ్డలైనా ప్రమాదకరమే !

ట్రెండింగ్‌

Advertisement