గురువారం 28 జనవరి 2021
Zindagi - Dec 02, 2020 , 00:06:07

అనుష్క శీర్షాసనం

అనుష్క శీర్షాసనం

వార్తల్లో మహిళ

అందాల తార అనుష్క శర్మ.. నిండు గర్భంతో శీర్షాసనం వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తల కిందకు.. కాళ్లు పైకి పెట్టి చాలా క్లిష్టమైన యోగాసనంతో అందరినీ ఆశ్చర్యంలో ఆమె ముంచెత్తారు. గోడను ఆధారంగా చేసుకొని అనుష్క తలకిందులుగా నిల్చోగా.. తన భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సాయం చేస్తున్న పాత ఫొటోను  అభిమానులతో పంచుకున్నారు. యోగా తన జీవనశైలిలో భాగమైపోయిందనీ, వైద్యుల సూచన మేరకే ఈ ఆసనాలు వేశానని చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడూ వ్యాయామాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 


logo