శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 22, 2020 , 00:17:11

అమ్రిన్‌ ఖురేషి

అమ్రిన్‌ ఖురేషి

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌ అనగానే ముంబయి అమ్మాయే అని ఫిక్స్‌ అయిపోతుంటాం. హైదరాబాదీని ఆ స్థానంలో ఊహించడం కష్టమే. కానీ టబు, సుస్మితా సేన్‌, అదితీరావు హైదరి లాంటివారు ఇక్కడ  పుట్టి బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా ఎదిగారు. ఆ వరుసలో సరికొత్తగా చేరింది అమ్రిన్‌ ఖురేషి. హైదరాబాద్‌కు చెందిన అమ్రిన్‌ నటన మీద ఆసక్తితో ముంబయి వెళ్లి అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరింది. తర్వాత రకరకాల కోర్సులు చేసి యాక్టింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ సీనియర్‌ హీరో మిథున్‌ చక్రవర్తి కొడుకు నమాషి చక్రవర్తి మొదటి సినిమాలో నటించనున్నది. ‘సినిమా చూపిస్త మామా’ చిత్రాన్ని డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ సంతోషి బాలీవుడ్‌లో ‘బ్యాడ్‌ బాయ్‌'గా రీమేక్‌ చేస్తున్నారు. అందులో ఈ ఇద్దరూ పరిచయం కానున్నారు. ఈ సినిమాకు అమ్రిన్‌ తండ్రి సాజిద్‌ ఖురేషి నిర్మాత. సినిమా రిలీజ్‌ కాకముందే అమ్రిన్‌ మరో ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసింది. అది కూడా  ‘జులాయి’ హిందీ రీమేక్‌ కోసం.