రేసింగ్ గేమ్స్‌కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఉన్నచోటు నుంచి కదలకుండా సూపర్ బైక్‌లు, స్పీడ్ కార్లను మునివేళ్లతో శాసించడంలో ఉన్న మజాయే వేరు. ఆటలో మరింత లీనమయ్యేందుకు పర్ఫెక్ట్ వేదిక అవసరం. ఇందుకోసం గేమింగ్ పాడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కూల్‌మాస్టర్ సంస్థ తాజాగా ఓఆర్బీ ఎక్స్ గేమ్పాడ్ను విడుదల చేసింది. మసాజ్ కుర్చీలా కనిపించే ఈ గేమ్ పాడ్‌లో కూర్చోవడం తరువాయి, పుష్పక విమానం అధిరోహించిన అనుభూతి కలుగుతుంది. పూర్తిగా ఆటోమేటెడ్ గేమ్పాడ్లో స్పెషల్ సౌండింగ్ సిస్టమ్, మల్టిపుల్ స్క్రీన్ సౌకర్యాలు ఉన్నాయి. గంటల తరబడి ఆటలో నిమగ్నమయ్యే వారికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక నిర్మాణం దీని ప్రత్యేకత. సెమీ ఎన్క్లోజ్డ్ కాక్‌పిట్‌లో హెడ్‌ఫోన్స్ లేకుండానే క్లియర్‌గా సౌండ్ వినొచ్చు. ముచ్చటగా మూడు స్క్రీన్లు చూసుకుంటూ ఆటను దిగ్విజయంగా కొనసాగించవచ్చు. ఓఆర్బీ ఎక్స్ కాక్పిట్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.