ఆదాశర్మకు అభిమానులంటే ప్రత్యేకమైన ప్రేమ. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటారు. తన మార్షల్ ఆర్ట్స్ సాధనకు సంబంధించి సోషల్ మీడియా ఖాతాల్లో తరచూ అప్డేట్స్ ఇస్తున్నారు. తాజా చిత్రం ‘కమెండో-4’ కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అందులో ప్రావీణ్యమూ సంపాదించారు. మొదట్లో ఒకే కర్రతో స్టంట్స్ చేసినా, ఇప్పుడు రెండు కర్రలను ప్రొఫెషనల్ మాస్టర్లా కంటికి కనిపించనంత వేగంగా తిప్పుతున్నారు. ‘సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని నేను ఆస్వాదిస్తాను. అందుకే కొత్తకొత్త ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. ఇదంతా నా అభిమానుల కోసమే. ఎందుకంటే వాళ్లే నా కుటుంబం’ అని మనసులోని మాట చెప్పేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్, మరో రెండు వెబ్ షోలతో బిజీగా ఉన్నారు ఆదా.