శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 04, 2021 , 00:38:29

సోషల్‌ గురు శోభన!

సోషల్‌ గురు శోభన!

భరతనాట్య కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శోభన గురించి తెలియని వారుండరు. మాతృభాష మలయాళమే అయినా, వివిధ భాషల చిత్రాల్లో నటించి సుపరిచితురాలయ్యారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఎంతోమందిని నాట్యకారులుగా తీర్చిదిద్దుతున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన కొన్నిరోజులకే తను ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టారు. అలాగే, కొత్తవాళ్లకు నాట్యంలో ఓనమాలు నేర్పించడానికి చిన్నచిన్న వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో శోభన ‘సోషల్‌ స్టార్‌'గా మారారు.

స్టూడెంట్స్‌వల్లే: లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచీ మ్యూజిక్‌, డ్యాన్స్‌ క్లాసులు కూడా పూర్తిగా ఆన్‌లైన్‌ అయ్యాయి. అయితే, ఇక్కడొచ్చిన చిక్కల్లా కొత్తవాళ్లకు ప్రాథమిక విషయాలు నేర్పించడం. ఆ పరిమితిని అధిగమించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా చిన్నచిన్న భంగిమలను వివరిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు శోభన. కొత్తగా భరతనాట్యం నేర్చుకోవాలనుకునే వాళ్లంతా వాటిని చూసి సాధన చేస్తున్నారు. వీడియోలతో పాటు ఆమె సినిమాలకు సంబంధించిన ఫొటోలనూ షేర్‌ చేస్తున్నారు. ‘నాకు నాట్యం తప్ప వేరే ప్రపంచం లేదు. ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా వంటివాటిని చాలాకాలం నేను పట్టించుకోలేదు. నా స్టూడెంట్స్‌ బలవంతం మీద అకౌంట్‌ ఓపెన్‌ చేశాను.  మరీ ఎక్కువ పోస్ట్‌లు షేర్‌ చేయడానికి కూడా ఇష్టపడను. నేనేమైనా అవతలివాళ్ల పర్సనల్‌ లైఫ్‌ను డిస్టర్బ్‌ చేస్తున్నానేమో అనే గిల్టీ ఫీలింగే అందుకు కారణం’ అని చెబుతారు యాభై ఏండ్ల శోభనా చంద్రకుమార్‌ పిైళ్లె.

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌..

రీల్స్‌ (కొన్ని సెకన్ల నిడివి కలిగిన వీడియోలు) చేయాలన్న ఆలోచన ఆమెకు లాక్‌డౌన్‌ టైమ్‌లో  వచ్చిందట. “ఒక్కసారిగా ఎవరికివాళ్లు ఇళ్లలో ఇరుక్కుపోయేసరికి నాకంతా కొత్తగా, వింతగా అనిపించింది. ఎప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకునే నాకు, నిర్బంధంలోని నిశ్శబ్దాన్ని చూసి  చాలా భయమేసింది. నా డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను క్లోజ్‌ చేసిన వెంటనే, ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలు పెట్టాను. అలా, నా విద్యార్థులకు దగ్గరగా ఉండటం సంతోషాన్నిచ్చింది. కానీ కొత్తగా నేర్చుకునేవాళ్లకు ఎలా? అన్న ప్రశ్న వేధించింది. వీడియోలు చేయాలనే ఐడియా అలా వచ్చిందే. నా వీడియోలను చూసి నాట్యం పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా సాధన చేయొచ్చు” 

VIDEOS

logo