ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 24, 2020 , 23:09:38

‘మాస్క్‌'ప్రెన్యూర్‌... లావణ్య త్రిపాఠి

‘మాస్క్‌'ప్రెన్యూర్‌... లావణ్య త్రిపాఠి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సినీతారలు వివిధ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.  వారిలో లావణ్య త్రిపాఠి  మాస్కుల తయారీ వ్యాపారంలోకి ఆడుగుపెట్టారు. హైదరాబాదీ డిజైనర్‌ అనితారెడ్డితో కలిసి మాస్కులను తయారుచేస్తున్నారు లావణ్య త్రిపాఠి. ‘రెడ్‌ ట్రీ’ బ్రాండ్‌ పేరుతో వీటిని మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ అనేక మంది సెలబ్రిటీలు ఈ మాస్కులనే ధరిస్తున్నారు. అయితే, ఈ వ్యాపారం మొదలయ్యేందుకు ‘కరోనా’నే కారణమని లావణ్య చెబుతున్నారు.  షూటింగులు నిలిచిపోవడంతో పరిశ్రమపై ఆధారపడ్డవారంతా ఖాళీగా ఉంటున్నారు. హీరోయిన్లకు దుస్తులు రూపొందించే అనేక మంది టైలర్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాస్కుల తయారీని ప్రారంభించారు. వీలైనంత ఎక్కువ మందికి మాస్కులు అందించడం కోసం ఎలాంటి లాభాలను ఆశించకుండా పనిచేస్తున్నామని చెబుతున్నారు. దీంతోపాటు కరోనా మరింత వ్యాపించకుండా, ప్రజల ఆరోగ్యాలకు కాపాడేందుకు తమవంతు సాయం అందిస్తున్నామని అంటున్నారు. అయితే ప్రస్తుతం మాస్కులు మాత్రమే తయారు చేస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో ‘రెడ్‌ ట్రీ’ బ్రాండ్‌ పేరుతో మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తామంటున్నారు లావణ్య త్రిపాఠి.


logo