గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 10, 2021 , 03:00:17

ఆకాశమే ఆయేషా హద్దు

ఆకాశమే ఆయేషా హద్దు

కశ్మీరీ మహిళలు లింగ వివక్షను అధిగమిస్తున్నారు. ఘన విజయాలు సాధిస్తున్నారు. కశ్మీరీ యువతి ఆయేషా అజీజ్‌ దేశంలోనే పిన్న వయస్కురాలైన పైలెట్‌గా రికార్డు సృష్టించింది. ఆయేషా పదిహేనేండ్లకే స్టూడెంట్‌ పైలెట్‌గా లైసెన్సు పొందింది. తర్వాతి ఏడాది రష్యాలోని సోకోల్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద శిక్షణ తీసుకుంది. అలా, మిగ్‌-29 జెట్‌ నడపడానికి అర్హత సాధించింది. బొంబయి ఫ్లయింగ్‌ క్లబ్‌ (బీఎఫ్‌సీ) నుంచి విమానయానంలో పట్టభద్రురాలైంది. మూడేండ్ల క్రితం, కమర్షియల్‌ లైసెన్స్‌ కూడా సంపాదించింది. ‘కశ్మీరీ మహిళలు చాలా బాగా పనిచేస్తారు. గత కొన్నేండ్లుగా విద్యా రంగంలో కూడా పురోగతిని సాధిస్తున్నారు’ అని చెబుతున్నది ఆయేషా. బాల్యం నుంచీ ఆయేషాకు ప్రయాణాలంటే ఇష్టం. ఆకాశంలో ఎగరాలని కలలుగనేది. 

‘పైలెట్‌ వృత్తి సవాళ్లతో కూడుకున్నది. మన చేతిలో వందల మంది ప్రాణాలుంటాయి. వాళ్లను సురక్షితంగా గమ్యానికి చేర్చడం మన బాధ్యత. మా వృత్తిలో నిత్యం అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవాలంటే మానసికంగా కూడా బలంగా ఉండాలి. వృత్తి పట్ల అంతకు మించిన ఇష్టం ఉండాలి’ అని చెబుతున్నది ఆయేషా. ఈ విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేసిందామె.

VIDEOS

logo