పట్టు, కాటన్, క్రేప్ చీరలు… మనకు తెలిసినవే. కానీ ఇక్కడ కనిపిస్తున్నది మాత్రం ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని చీర. ఎందుకంటే దీన్ని రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. లండన్‌లోని పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కంపెనీతో కలిసి నుట్ఖుట్, బోన్మత్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ అరుదైన చీరకు ప్రాణంపోశారు.
ఎలిజబెత్ రాణి బ్రిటిష్ సామ్రాజ్ఞిగా బాధ్యతలు చేపట్టి 70 ఏండ్లు నిండిన సందర్భంగా లండన్‌లో నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఈ పర్యావరణ హితమైన చీరను ప్రదర్శించారు. దీనిమీద అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యంలోని 54 దేశాల చిత్రాలు ఉన్నాయి.