ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్తే పెండ్లి సందడిలో గృహాలంకరణ చిత్రంగా ఉండేది. రంగురంగుల కాగితాలను విభిన్న ఆకారాల్లో కత్తిరించి దూలాలకు, వాసాలకు అతికించి పెండ్లి కళ తెచ్చేవాళ్లు.
…కొన్నాళ్ల తర్వాత రంగుకాగితాలతో పూలు తయారు చేసి గోడలకు వేలాడదీసేవాళ్లు. కాలక్రమంలో ఆ ముచ్చట్లన్నీ మాయమయ్యాయి. కానీ, ఇప్పుడు అదే పేపర్ ఆర్ట్ ఇంటికి కొత్త సొబగులు అద్దుతున్నది. ‘ఒరిగమి’ పేరుతో మొదలైన డెకరేషన్ ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంటున్నది. పేపర్‌తో మలిచిన పక్షులు, జంతువులు ఇంటి గోడలపై కొలువుదీరుతున్నాయి. రంగురంగు కాగితాలతో పంచవన్నెల రామచిలుకలను తయారు చేసి రూఫ్‌కు వేలాడదీసి పడగ్గదినే పక్షి ప్రపంచంగా మార్చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. పిల్లగాలికి కదలాడే పక్షులను చూస్తూ మైమరచిపోతున్నారు. కాగితంతో పులి, జింక బొమ్మలను తయారు చేసి ద్వార బంధంపై ముస్తాబు చేస్తున్నారు. వాటికి తమ సృజనను జోడిస్తూ జపనీస్ కళతో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఈ కళకు ఆదరణ పెరగుతున్నది. దీంతో ఇంటీరియర్ డెకరేషన్లో ఒరిగమి కొత్తగా ఒదిగిపోతున్నది.